కెరమెరి, న్యూస్‌లైన్ : ఆంధ్రా, మహారాష్ట్ర వివాదాస్పద సరి హద్దులోని రెండు గ్రామాల పంచాయతీలైన పరందోళి, అంతాపూర్ ప్రజలు రెండ్రోజుల్లో రెండు రాష్ట్రాల్లో రెండు సార్లు ఓటు హక్కు విని యోగించుకున్నారు. గురువారం మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన పార్లమెం టు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. శుక్రవారం జిల్లాలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఓటు వేశారు. అంతాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన ఓటర్లకు బోలాపటార్‌లో, బోలాపటార్‌కు చెందిన ఓట ర్లఅంతాపూర్‌లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో రవాణా సౌకర్యం కోసం ఓట ర్లు ఇబ్బంది పడ్డారు.
ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా.. బోలాపటార్‌లో 8.30 గంటల వరకు ఒక్కరూ ఓటు వేయలేదు. అనంతరం ఒక్కొక్కరుగా వచ్చారు. పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉండడంతో ఆల స్యం జరిగింది. మరోవైపు అనేకమంది కాలినడకన రావడంతో ఇబ్బంది పడ్డారు. చంద్రాపూర్ ఎంపీ ఎన్నికల్లో ఎడమచేయి చూపుడు వేలుకి సిరా చుక్కవేయగా, శుక్రవారం జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎడమచేయి మధ్యవేలికి సిరా చుక్కవేశారు. రెండు గ్రామ పంచాయతీల్లో మొత్తం 2,585 ఓటర్లు ఉన్నారు. ఇందులో పరందోళి గ్రామపంచాయతీలో 1,317మంది ఓటర్లకు గాను 1071 మంది ఓటు వేశారు. 81.32 శాతం పోలింగ్ నమోదైంది. అంతాపూర్ గ్రామ పంచాయతీలో 1,268 ఓటర్లకు గాను 922మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 72.71శాతం పోలింగ్ నమోదైంది. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఔను.. వారు రెండు రాష్ట్రాల్లో ఓటేశారు
Published Sat, Apr 12 2014 2:29 AM | Last Updated on Mon, Oct 8 2018 6:18 PM
Advertisement
Advertisement