బాన్సువాడ, న్యూస్‌లైన్ : ఒకవైపు ఎన్నికల సంఘం పకడ్బందీగా నిబంధనలు అమలు చేస్తోంది. అనుక్షణం అభ్యర్థులపై నిఘా పెడుతోంది. ఏమాత్రం కట్టు తప్పినా కఠినంగా స్పంది స్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు, పార్టీల నాయకులు ఆచితూచిగా స్పందిస్తున్నారు. పాతపద్ధతులతో పరేషాన్ వద్దంటూ.. కొత్త పద్ధతుల్లో ప్రచారంలో దూసుకెళ్తున్నా రు. నవతరం ఓటర్లను ఆకట్టుకునేందుకు సామాజిక మా ద్యమాన్ని ఎంచుకొని ప్రచారం చేస్తున్నారు.
ఈసారి ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీంలు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, పోలీసులతో నిఘా పెంచడం అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు తలనొప్పిగా తయారయ్యింది. ప్రచార నిబంధనలు ఉల్లంఘిస్తే కేసుల పాలవ్వాల్సి వస్తుంది. దీంతో కొంతమంది అభ్యర్థులు ప్రచారంలో కొత్త పద్ధతులను ఎంచుకున్నారు. సంప్రదాయ పద్ధతులతో పాటు ఇంటర్నెట్, ఫేస్‌బుక్, సెల్‌ఫోన్ల ద్వారా ఓట్లభ్యర్థిస్తున్నారు. యువ ఓటర్లు భారీగా ఉండడం, వారు ఫోన్, ఇంటర్నెట్ వినియోగిస్తుండడంతో అభ్యర్థులు సామాజిక మాధ్యమాలను ప్రచారానికి ఎంచుకుంటున్నారు. గెలిపిస్తే తామేం చేస్తామో ఫెస్‌బుక్ పేజీల్లో పోస్ట్ చేస్తున్నారు.
ప్రచార ఫోటోలను ఎప్పటికప్పుడు అపడేట్ చేస్తున్నారు. మరోవైపు అత్యాధునిక త్రీడీ వాహనాల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు. ఫేస్‌బు క్, ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ప్రచారం చేయడం లో టీడీపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మదన్‌మోహన్‌రా వు ముందంజలో ఉన్నారు. ఇప్పటికే ఆయన తన ప్రత్యేకమైన మెనిఫెస్టోను తయారు చేసి ఫోన్లలో వైస్ రికార్డింగ్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్‌రెడ్డి తరపున సురేశ్‌రెడ్డి యువసేన, కామారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ తరపున షబ్బీర్ అలీ యువసేన, టీడీపీ అభ్యర్థి గంప గోవర్ధన్ తరపున గంప గోవర్ధన్ యువసేన ఫేస్‌బుక్ ద్వారా ప్రచారం చేస్తోంది. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా బీజేపీ తమ లక్ష్యాలను వివరిస్తోంది.
ఆన్‌లైన్‌లోనే అన్నీ..
ఓట్ల కోసం డబ్బులు, మద్యం, క్రికెట్ కిట్లు, సెల్‌ఫోన్లు, చీరలు ఎరవేయడం అందరికీ తెలిసిందే. సాంకేతిక విజ్ఞానాన్ని వాడుకొంటూ ఆన్‌లైన్ ద్వారా పంపకాలు చేసేందు కు కొందరు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. యువకులు, కళాశాల విద్యార్థుల బ్యాంకు ఖా తాల వివరాలను సైతం సేకరిస్తున్నారని సమాచారం.
అంతా ఆన్‌లైన్‌లోనే..
Published Fri, Apr 18 2014 2:10 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement