చంద్రబాబు పిరికివాడు: కిరణ్ | Candrabābu pirikivāḍu: Kiraṇ Being a coward: Kiran | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పిరికివాడు: కిరణ్

Published Mon, Mar 24 2014 4:59 AM | Last Updated on Sat, Jul 28 2018 3:21 PM

చంద్రబాబు పిరికివాడు: కిరణ్ - Sakshi

చంద్రబాబు పిరికివాడు: కిరణ్

 ఏలూరు: తెలుగు జాతి కలిసుండాలని నోటితో చెప్పలేని పిరికివాడు చంద్రబాబు అని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆదివారం ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రసంగించిన ఆయన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై నిప్పులు చెరిగారు.


తన లేఖవల్లే రాష్ట్ర విభజన జరిగిందని తెలంగాణకు వెళ్లినప్పుడు, ఎలా విభజిస్తారంటూ ఆంధ్రాకు వచ్చినప్పుడు రెండు నాల్కల ధోరణి అవలంబించిన చంద్రబాబు అసెంబ్లీలో 40 రోజులు చర్చ జరిగితే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఏనాడైనా చెప్పారా? రాష్ట్రాన్ని విభజించుకోమని కేంద్రానికి రెండు లేఖలు రాసిన వ్యక్తిని మీరు నమ్ముతారా? అని ప్రజలను ప్రశ్నించారు.

 అది కేసీఆర్ ఆఫీస్‌లో కొళాయి కాదు

 కైకలూరు, న్యూస్‌లైన్: నదీ జలాల విడుదల అంశం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ కార్యాలయంలో కొళాయి లాంటిది కాదని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్, చంద్రబాబులపై ఆయన ధ్వజమెత్తారు. సీమాంధ్రకు నీటి విడుదలను ఆపే సత్తా కేసీఆర్‌కు లేదన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement