![బాలకృష్ణ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/71398154280_625x300_2.jpg.webp?itok=NEmM-jfx)
బాలకృష్ణ
హైదరాబాద్: హిందూ దేవుళ్లను అగౌరవపరిచారని టిడిపి అభ్యర్థులు బాలకృష్ణ, కింజరాపు రామ్మోహన్ నాయుడు, భగ్గు రమణమూర్తిలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ వైఎస్ఆర్ సిపి లేఖ రాసింది. టీడీపీ అభ్యర్థులు హిందూ దేవుళ్లను అవమానపరిచారని ఆ లేఖలో పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు ఫొటోపై జై తెలుగుదేశం అని ప్రింట్ చేయించిన టీ షర్ట్‌లను టీడీపీ కార్యకర్తలు ధరిస్తుట్లు తెలిపారు. ఇది కచ్చితంగా హిందు దేవుళ్లను కించపరిచినట్లేనని పేర్కొన్నారు.
హిందూ మతాన్ని అగౌరపరచే వారిపై ఎన్నికల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించి పోటీ నుంచి తప్పించాలని వైఎస్ఆర్ సీపీ ఇసిని కోరింది.