వెబ్బు.. చాలదు డబ్బు
Published Thu, Apr 3 2014 12:52 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
ఏలూరు, న్యూస్‌లైన్:వెబ్‌క్యాస్టింగ్ నడుమ పోలింగ్ నిర్వహించే విషయంలో అధికారులకు ఆటుపోట్లు తప్పడం లేదు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ తీరు చిత్రీకరణకు వెబ్‌క్యాస్టింగ్ విధానాన్ని అమలు చేయూలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. పోలింగ్ సందర్భంగా తలెత్తే ఇబ్బందులను ఆన్‌లైన్‌లో చూడటం ద్వారా అధికారులు అప్రమత్తం కావడానికి ఈ విధానం ఉపకరిస్తుంది. అరుుతే, దీనిని అందిపుచ్చుకునేందుకు అధికారులు అగచాట్లు పడుతున్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు కలిగిన ల్యాప్‌టాప్ కంప్యూటర్లను ఏర్పాటు చేసి, వాటిని ఆపరేట్ చేసే వ్యక్తుల అవసరం చాలా ఉంది.
ఇందుకోసం ఇంజినీరింగ్, ఎంసీఏ విద్యార్థులను ఉపయోగిస్తున్నారు. అరుుతే, వీరు జిల్లా అంతటా అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ల్యాప్‌టాప్‌లు గల విద్యార్థుల వివరాలను ఇవ్వాల్సిందిగా కళాశాలల యూజమాన్యాలను యంత్రాంగం కోరుతోంది. కాగా వచ్చే నెలలో జరిగే సాధారణ ఎన్నికల్లోనూ పెద్దఎత్తున వెబ్ కెమెరాలు వినియోగించాల్సి రావటం అధికారులను కలవరపరుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం 3,038 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, కనీసం సగం కేంద్రాల్లోనైనా వెబ్‌క్యాస్టింగ్ అవసరం అవుతుందని భావిస్తున్నారు.
అరకొరగా ఐదొందలు
ల్యాప్‌టాప్‌ల కోసం జెడ్పీ అధికారులు టెండర్లు పిలిచారు. దీనికి స్పందన లభించలేదు. దీంతో ల్యాప్‌టాప్ కలిగిన విద్యార్థులు రోజంతా పోలింగ్ కేంద్రంలో వెబ్‌క్యాస్టింగ్ చేస్తే రూ.500 ఇస్తామని అధికారులు ప్రకటించారు. అక్కడక్కడా ఔత్సాహికులైన కొందరు తప్ప విద్యార్థులెవరూ పెద్దగా ముందుకు రావడం లేదు. గత నెల 30న నిర్వహించిన మునిసిపల్ ఎన్నికల పోలింగ్‌లో విద్యార్థుల సేవలను వినియోగించుకున్నప్పటికీ ఎంత సొమ్ము ఇస్తారనేది ముందుగా చెప్పలేదు. చివరకు స్థానిక అధికారులు బేరాలు ఆడటంతో విద్యార్థులు వెబ్‌క్యాస్టింగ్ సేవలందించేందుకు ఆసక్తి చూపటం లేదు. ఈ సమస్యను ఎలా అధిగమించాలనేది అధికారులకు అర్థం కావడం లేదు.
Advertisement
Advertisement