పార్టీల విలీనం కోసమే రాష్ట్రాలిస్తారా?
కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. రాజకీయ పార్టీలను విలీనం చేసుకోడానికే కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేస్తారా అంటూ నిలదీశారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తమ పార్టీని విలీనం చేస్తామంటేనే తెలంగాణ ఇచ్చారా.. అలా అయితే తాను 2012లో విలీనం చేస్తానన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తన పర్యటనను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని ఎద్దేవా చేశారు.
సోనియా, రాహుల్ గాంధీలు ప్రజల సమస్యల గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని కేసీఆర్ నిలదీశారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ బాకీ ఉందని, తనపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అవినీతి ఆరోపణల మీద ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.