మోడీని ఎలా నమ్ముతారు? | How can people trust Narendra Modi, asks Sharad Pawar | Sakshi

మోడీని ఎలా నమ్ముతారు?

Apr 2 2014 3:32 PM | Updated on Aug 15 2018 2:14 PM

మోడీని ఎలా నమ్ముతారు? - Sakshi

మోడీని ఎలా నమ్ముతారు?

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ఎన్సీపీ అధినేత, కేంద్ర శరద్ పవార్ మాటల దాడి ముమ్మరం చేశారు.

అలీబాగ్(మహారాష్ట్ర): బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ఎన్సీపీ అధినేత, కేంద్ర శరద్ పవార్ మాటల దాడి ముమ్మరం చేశారు. మోడీని ప్రజలు ఎలా నమ్ముతారని పవార్ అన్నారు. గుజరాత్ రాజధానికి సమీపంలో కాంగ్రెస్ ఎంపీని తగులబెడితే కనీసం బాధితుడి కుటుంబ సభ్యులను కూడా మోడీ పరామర్శించలేదని గుర్తు చేశారు. ఇలాంటి వ్యక్తి దేశానికి ఏం భరోసా ఇవ్వగలరని ప్రశ్నించారు.

ఇప్పటివరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిని ముందుగా ప్రకటించడం ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రధాని అభ్యర్థి పేరును ముందుగా ప్రకటించి రాజ్యాంగాన్ని బీజేపీ అవమానించిందన్నారు. రాయ్గడ్ లోక్సభ స్థానికి పోటీ చేస్తున్న ఎన్సీపీ అభ్యర్థి సునీల్ తత్కరే తరపున పవార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Photos

View all
Advertisement