
నేడు కేసీఆర్ నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ముందుగా ఉదయం 8.15కు మెదక్ జిల్లాలోని కోనాయిపల్లి దేవాలయంలోని వెంకటేశ్వర స్వామి ముందు బీ ఫాంను ఉంచనున్నారు. సెంటిమెంట్‌గా ప్రతి ఎన్నికల సమయంలోనూ ఆయన ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. అనంతరం 10.30కు సంగారెడ్డికి వెళ్లి మెదక్ ఎంపీ స్థానానికి, మధ్యాహ్నం 12.30కు గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్లు దాఖలు చేస్తారు. సాయంత్రం 5.30కు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పోటీ చేస్తున్న నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.