
19న కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేషన్
సాక్షి, హైదరాబాద్: జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 19న పీలేరులో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరు చేరుకుంటారు. అక్కడినుంచి కలికిరికి వచ్చి రాత్రికి అక్కడ బస చేస్తారు. శనివారం ఉదయం పీలేరు చేరుకుని ఆ నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తారు. అనంతరం రోడ్‌షోలో పాల్గొంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 20, 21 తేదీల్లో కూడా కిరణ్ రోడ్ షోల్లో పాల్గొంటారని తెలిపాయి.