
సీమాంధ్రలో బీసీని సీఎం చేస్తే తప్పుకుంటా
చంద్రబాబుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి సవాల్
నల్లగొండ , న్యూస్‌లైన్ : సీమాంధ్రలో బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటిస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని నల్లగొండ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ చేశారు. నల్లగొండలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబు అలా ప్రకటిస్తే రంగం నుంచి తప్పుకోవడమే కాకుండా, పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి విజయానికి తాను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేస్తామన్నారు. బీసీని పార్టీ అధ్యక్షుడిగా నియమించడానికి సాహసం చేయని చంద్రబాబు.. రెండు సీట్లైనా గెలవలేని తెలంగాణలో బీసీని సీఎం చేస్తానంటే ఎవరూ నమ్మరన్నారు. వందమంది మోడీలు వచ్చినా తెలంగాణలో టీడీపీ-బీజేపీ కూటమికి డిపాజిట్లు దక్కవన్నారు. మామను వెన్నుపోటు పొడిచిన మాదిరిగా బీసీలకు వెన్నుపోటు పొడవద్దన్నారు.