మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఈ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు.
హైదరాబాద్: మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఎమ్మెల్సీ కె. నాగేశ్వర్ ఈ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. ఈ నెల 30న ఆయన సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక ప్రజల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. తనకు మద్దతు తెలపాలని ఆయన కోరనున్నారు.
సన్నిహితులు, మిత్రులతో ఇప్పటికే సంప్రదింపుల పర్వం పూర్తి చేసిన నాగేశ్వర్.. ఏదో ఒక పార్టీ తరపున కాకుండా, తన పంథా, వైఖరి రీత్యా అన్ని వర్గాల మద్దతు పొందేందుకు స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేయాలని నాగేశ్వర్ నిర్ణయించుకున్నారు.
నాగేశ్వర్కు మద్దతు ఇచ్చేందుకు సీపీఎం సుముఖంగా ఉన్నట్టు కనబడుతోంది.