
మహిళలంటే మోడీకి గౌరవంలేదు
జలౌన్/సీతాపూర్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మహిళలంటే గౌరవం లేదని, అందుకే దొంగ చాటుగా మహిళల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీ కూడా తాజాగా ఇదే అంశంపై మోడీని విమర్శించిన సంగతి తెలిసిందే.
గురువారం ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్, సీతాపూర్‌లో నిర్వహించిన సభల్లో రాహుల్ మాట్లాడారు. రైతులకు చెందిన 45 వేల ఎకరాలను చదరపు మీటరు రూపాయి చొప్పున మోడీ అదానీ గ్రూపునకు కట్టబెట్టారని, ఆ గ్రూపు ఒక్క పరిశ్రమ కూడా స్థాపించలేదన్నారు.