ఒక్క ఓటు - రెండు రాష్ట్రాలు
అక్కడ ఓటెయ్యాలంటే పొరుగు రాష్ట్రానికి వెళ్లాల్సిందే. అక్కడి పరిస్థితి అలాంటిది. మేఘాలయ లోని నార్త్ గారో హిల్స్ నియోజకవర్గంలో పదకొండు పోలింగ్ బూత్ లకు వెళ్లాంటే ఓటర్లు అస్సాం రాష్ట్రంలోకి రావాలి. అక్కడనుంచి మళ్లీ మేఘాలయ లోకి వెళ్లాలి. అప్పుడు ఓటేయాలి. అందుకే ఒక్క ఓటుకు రెండు రాష్ట్రాలు ప్రయాణించాలి.
సమస్యేమింటంటే ఈ గ్రామాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు తగాదాలున్నాయి. చాలా హింస కూడా జరిగింది. అందుకే ఈ పోలింగ్ బూత్ ల ఏర్పాట్లు చేయాలంటే అస్సాం లోని గోల్పారా జిల్లా అధికారుల కలిసి మేఘాలయ అధికారులు సమావేశాలు ఏర్పాటు చేయాలి. శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూసుకోవాలి. ఇంతా చేసి మొత్తం ఓటర్ల సంఖ్య వంద కూడా ఉండదు.