సాయంత్రం 4 గంటలకు పవన్ - మోడీ భేటీ | pawan kalyan to meet narendra modi | Sakshi
Sakshi News home page

సాయంత్రం 4 గంటలకు పవన్ - మోడీ భేటీ

Published Fri, Mar 21 2014 10:25 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

సాయంత్రం 4 గంటలకు పవన్ - మోడీ భేటీ - Sakshi

సాయంత్రం 4 గంటలకు పవన్ - మోడీ భేటీ

జనసేన పేరుతో పార్టీ పెట్టినట్లు ప్రకటించి, ఇటు టీడీపీ.. అటు బీజేపీ రెండింటితోనూ పొత్తు పెట్టుకోవాలని చూస్తున్న పవన్ కల్యాణ్.. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలుస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వీరిద్దరి మధ్య సమావేశం జరగడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్న పవన్ వెంట సీమాంధ్ర ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకుడు సోము వీర్రాజు కూడా ఉన్నారు.

వాస్తవానికి వీళ్లిద్దరి సమావేశం గురించి ముందు ఉంటుందని, తర్వాత ఉండదని, మళ్లీ ఉంటుందని రకరకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేశాయి. పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు కూడా మోడీని పవన్ కలవట్లేదని అన్నారు. చివరకు కలుస్తున్నట్లు జనసేన వర్గాలు చెప్పాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement