రామ్‌దేవ్ యోగా శిబిరాలపై ఈసీ ఝలక్...
బాబా రామ్‌దేవ్ నిర్వహించే యోగా శిబిరాలపై ఎన్నికల కమిషన్ గట్టి ఝలక్ ఇచ్చింది. యోగా శిబిరాలను ఎన్నికల ప్రచారం కోసం దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నట్లయితే, అనుమతి నిరాకరించాలంటూ అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఆదేశాలు పంపింది. యోగా శిబిరాల నిర్వాహకులు ఇదివరకు వాటిని దుర్వినియోగం చేసుకున్న దాఖలాలు ఉన్నట్లయితే, అనుమతులు ఇవ్వరాదని స్పష్టం చేసింది.
కాగా, పంజాబ్‌లో ఏప్రిల్ 2న యోగా శిబిరం నిర్వహించిన రామ్‌దేవ్, తన శిబిరాన్ని బీజేపీ-అకాలీ కూటమికి ప్రచారం కోసం వాడుకున్నట్లుగా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే, ఢిల్లీలో రామ్‌దేవ్ నిర్వహించిన యోగా శిబిరానికి మోడీ హాజరు కావడంతో ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీసు పంపింది.