ఎన్నికల ప్రచారంలో భాగంగా అనుమతి లేకుండా సభ నిర్వహించినందుకు టీడీపీ అభ్యరి మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిపై ఎస్.కోట పోలీసు లు కేసు నమోదు చేశారు.
శృంగవరపుకోట, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా అనుమతి లేకుండా సభ నిర్వహించినందుకు టీడీపీ అభ్యరి మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిపై ఎస్.కోట పోలీసు లు కేసు నమోదు చేశారు. వసి గ్రామంలో ఆదివారం రాత్రి 9 గంట ల సమయంలో టీడీపీ నేతలు సభ నిర్వహిస్తున్నారన్న సమాచారం అం దుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు గ్రామానికి వెళ్లి వీడియో రికార్డింగ్ చేస్తుండగా టీడీపీ నేతలు తలోదిక్కుకు చెల్లాచెదురయ్యారు. ఎన్నిక ల కోడ్ అమల్లో ఉండగా అనుమతులు లేకుండా సభ నిర్వహించడంపై మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, శోభా స్వాతిరాణి, రెడ్డి వెంకన్న, రాయవరపు చంద్రశేఖర్, జి.ఎస్.నాయుడు, ఆడారి రమేష్, ఎర్రా గోపి, యేడువాక అప్పలనాయయుడు, జనపురెడ్డి తాతబాబులపై కేసులు నమోదు చేసినట్టు ఎస్.కోట ఎస్.ఐ ఎస్.కె.ఎస్.ఘనీ చెప్పారు.