‘అనంత’లో జేసీ దివాకరరెడ్డి తన శైలి రాజకీయాన్ని ప్రదర్శించారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీ బలిజలపై సవతి ప్రేమ చూపుతోందన్న వాదనకు బలం చేకూరింది. కేవలం ఓట్ల కోసం వారిని వాడుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అనంతపురం కైం, న్యూస్‌లైన్ : ‘అనంత’లో జేసీ దివాకరరెడ్డి తన శైలి రాజకీయాన్ని ప్రదర్శించారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీ బలిజలపై సవతి ప్రేమ చూపుతోందన్న వాదనకు బలం చేకూరింది. కేవలం ఓట్ల కోసం వారిని వాడుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. అనంతపురం అర్బన్ టికెట్‌పై చాన్నాళ్లుగా ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం అర్థరాత్రి ఈ స్థానానికి ప్రభాకర్ చౌదరి పేరును ఖరారు చేశారు. ఈ వ్యవహారంపై బలిజ సామాజిక వర్గం పెద్దలు పెదవి విరుస్తున్నారు. అనంతపురం లోక్‌సభకు టీడీపీ తరఫున బరిలో నిలిచిన జేసీ దివాకరరెడ్డి వేసిన ప్లాక్ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం ప్రభాకర్ చౌదరి ఇంటికి జేసీ దివాకరరెడ్డి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అనంతపురం టికెట్ వచ్చేలా చేస్తానని జేసీ.. చౌదరికి హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈ సమయంలోనే రాజకీయ కుట్రకు వారిద్దరూ తెరలేపినట్లు సమాచారం. ఇందులో భాగంగా అసెంబ్లీ టికెట్ రాన్నట్టుగా అందరినీ నమ్మించి.. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, అనంతపురం సీటు ఆశిస్తున్న మహాలక్ష్మి శ్రీనివాస్‌ను ముగ్గులోకి దించారు. అనంతరం ఇద్దరూ కలిసి పోయామంటూ మహాలక్ష్మితో కలిసి పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు.
కొంత సేపు అసమ్మతి నాటకమాడారు. చివరకు మహాలక్ష్మి శ్రీనివాస్‌కు మొండి చేయి చూపి టికెట్‌ను సాధించుకుని అటు బలిజలను, ఇటు ముస్లింలను మోసం చేశారు. మొన్నటి ఉప ఎన్నికలో మహాలక్ష్మి శ్రీనివాస్ తనకు ఇష్టం లేదని చెప్పినా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక నీకే అవకాశం ఇస్తామంటూ హామీ కూడా ఇచ్చారు. ఆ హామీ నిజమని నమ్మిన మహాలక్ష్మీ శ్రీనివాస్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేశారు. తీరా ఇప్పుడు ప్రభాకర్‌చౌదరికి అవకాశమిచ్చారు. ఈ వ్యవహారంలో జేసీ బ్రదర్స్ పాత్ర కీలకమని, ఈ ఎన్నికల్లో వారికి సహకరించేది లేదని బలిజ సామాజిక వర్గం నేతలు చెబుతున్నారు.
వైఎస్‌ఆర్‌సీపీలో బలిజలకు పెద్ద పీట
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలిజలకు పెద్ద పీట వేసిందని ఆ వర్గం నేతలు చెబుతున్నారు. అనంతపురంలో మేయర్ స్థానంతో పాటు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తమ వారికే ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో ఉన్న బలిజ సామాజిక వర్గం వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతు ప్రకటించనుందని సమాచారం.