బాబు హామీలకు అమెరికా బడ్జెట్ సరిపోదు | the budget is not enough for chandrababu naidu assurances | Sakshi
Sakshi News home page

బాబు హామీలకు అమెరికా బడ్జెట్ సరిపోదు

Published Tue, May 6 2014 3:29 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

the budget is not enough for chandrababu naidu assurances

 వేంపల్లె, న్యూస్‌లైన్ : చంద్రబాబు ఇస్తున్న హామీలకు భారతదేశం బడ్జెట్ కాదుకదా అమెరికా బడ్జెట్ కూడా సరిపోదని.. కేవలం అధికార దాహంతోనే ఆచరణ సాధ్యం కాని  హామీలు గుప్పిస్తున్నారని.. ప్రజలు నమ్మవద్దని వైఎస్సార్‌సీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, నాయకులు కందుల రాజమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిలు స్పష్టం చేశారు.  

సోమవారం  వేంపల్లె నాలుగు రోడ్ల కూడలిలో జరిగిన బహిరంగ సభలో అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ  తాను జిల్లా అంతటా పర్యటించానని..  జగన్‌ను  సీఎంగా చూడాలన్నదే తమ తాపత్రయమని ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు.ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ   దీక్షలు చేశారని గుర్తుచేశారు. కందుల రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ కాంట్రాక్టర్ల చేతిలో నడుస్తోందన్నారు.  రాయలసీమలో సీఎం రమేష్ నాయుడు ఆ పని  చేస్తున్నారని.. ఆయన చెప్పినట్లే  బాబు నడుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.   
 
 వైఎస్ వివేకా  మాట్లాడుతూ తనకు ఇద్దరు కొడుకులు అని.. అన్న కొడుకు వైఎస్ జగన్ అని.. తమ్ముని కుమారుడు వైఎస్ అవినాష్‌లు అని.. వీరద్దరిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి మాట్లాడుతూ సీఎం రమేష్‌నాయుడు వైఎస్ జగన్‌కు పౌరుషం లేదని మాట్లాడారని.. సోనియా గాంధీకి ఎదురు తిరిగిన మొనగాడు   జగన్ కాదా అని తెలిపారు. ఎంపీపీ అభ్యర్థి రవికుమార్‌రెడ్డి మాట్లాడుతూ   వైఎస్ హయాంలో ఇడుపులపాయలో సాఫ్ట్‌వేర్ హబ్‌గా మార్చాలని ఆలోచన ఉండేదని.. జగన్ సీఎం అయితే ఆ కోరిక నెరవేరుతుందన్నారు.    వైఎస్‌ఆర్ సీపీ నాయకులు వేంపల్లె ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వారికి నాలుగు రోడ్ల కూడలిలో ఘన స్వాగతం పలికారు.
 
మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి షబ్బీర్‌వల్లి, మాజీ కో.ఆప్సన్ మెంబరు సాదక్‌వల్లి, బి.ప్రతాప్‌రెడ్డి, ఎస్.జయచంద్రారెడ్డి, జయరామిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కొండయ్య, వేంపల్లె మాజీ సర్పంచ్ సురేష్‌బాబు, సింగిల్ విండో అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, రుద్ర భాస్కర్‌రెడ్డి, మున్నీర్, షేక్షా, వార్డు మెంబర్లు మణిగోపాల్‌రెడ్డి, మోహన్‌పవర్, మహమ్మద్ దర్బార్ బాషా, మాజీ సర్పంచ్‌లు మిట్టా శ్రీనివాసులు, రామాంజనేయరెడ్డి, నాగసుబ్బారెడ్డి, మల్లయ్య, సర్పంచ్‌లు కృష్ణా నాయక్, ఆర్‌ఎల్‌వి ప్రసాద్‌రెడ్డి, యూత్ కొండయ్య పాల్గొన్నారు.
 
 వీసానే లేదు.. బ్యాంకు అకౌంటు ఎలా ఉంటుంది
 తమకు మలేసియా, హాంకాంగ్‌లలో ఖాతాలు ఉన్నాయ టే.. రవివర్మ అనే ఆయన తనకు లావాదేవీలు నడుపుతున్నారని టీడీపీ నాయకులు మాట్లాడటం అర్థరహితమని కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి టీడీపీ నాయకులపై మండిపడ్డారు. నాలుగు రోడ్ల కూడలిలో సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఆయన సోమవారం మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement