న్యూస్‌లైన్ నెట్‌వర్క్, నిజామాబాద్ : జిల్లావ్యాప్తంగా స్థానికపోరులో పలువురు ముస్లింలు బరిలో నిలిచారు. దాదాపు అన్ని పార్టీలు మైనారిటీలకు అంతంతే ప్రాధాన్యతనిచ్చాయి.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో
ఎలారెడ్డి : నియోజకవర్గంలో మైనారిటీ ఓటర్లు పదివేలకు పైగా ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికల బరిలో మాత్రం 14 మంది మైనారిటీలు ఉన్నారు. ఎల్లారెడ్డి మండలంలో ఏడుగురు, నాగిరెడ్డిపేటలో ఒకరు, లింగంపేటలో ముగ్గురు, గాంధారిలో ఇద్దరు, సదాశివనగర్‌లో ఒకరు పోటీలో ఉన్నారు. వీరిలో టీడీపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, టీఆర్‌ఎస్ నుంచి ఇద్దరు, బీఎస్సీ నుంచి ఇద్దరు, వైఎస్సార్‌సీపీ నుంచి ఒకరు, లోక్‌సత్తా నుంచి ఒకరు, స్వతంత్రలు ఇద్దరు ఉన్నారు.
జుక్కల్ నియోజకవర్గంలో
నిజాంసాగర్ : జుక్కల్ నియోజకవర్గంలో 102 గ్రామ పంచాయతీలకు గాను 75 ఎంపీటీసీ స్థానాలున్నాయి. సుమారు 212 మంది అభ్యర్థులు ఎన్నికల రంగంలో ఉన్నారు. ఇందులో 14 ఎంపీటీసీ స్థానాల్లో, ఒక జెడ్పీటీసీ స్థానంలో ముస్లింలు పోటీలో ఉన్నారు. మద్నూర్ మండలంలో ఏకగ్రీవమైన రెండు ఎంపీటీసీ స్థానాల్లోనూ ముస్లిం మహిళలే ఉండడం గమనార్హం. పిట్లం మండలం కాటేపల్లిలోనూ ఎంపీటీసీ అభ్యర్థిగా షేక్ అనూబేగం ఏకగ్రీవమయ్యారు. మద్నూర్ మండలంలో జడ్పీటీసీ స్థానానికి బషీర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నిజాంసాగర్ మండలంలోని కోమలంచ ఎంపీటీ సీ స్థానంలో అదిబా ఫర్హత్, గున్కుల్ ఎంపీటీసీ స్థానానికి కుర్షిద్ ఉన్నీసాబేగం పోటీలో ఉండగా, మండలంలోని మరో ఎంపీటీసీ స్థానానికి ముస్లిం అభ్యర్థి పోటీ పడుతున్నారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో
ఆర్మూర్ : నియోజకవర్గ పరిధిలో 58 ఎంపీటీసీ, మూ డు జడ్పీటీసీ స్థానాలున్నాయి. ఆర్మూర్ మండలంలో 22 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మామిడిపల్లి-2 స్థానానికి బీజేపీ సలీంను అభ్యర్థిగా నిలబెట్టింది. పెర్కిట్-1 స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ షేక్ బాబు, టీఆర్‌ఎస్ పార్టీ అబ్దుల్ నయీం, ఎంఐఎం పార్టీ జహీర్ అలీలను ఎంపీటీసీ అభ్యర్థులుగా బరిలో నిలిపింది. నందిపేటలో 19 ఎంపీటీసీ స్థానాలు ఉం డగా కుద్వాన్‌పూర్ నుంచి కాంగ్రెస్ట్ అభ్యర్థిగా తబ్రీన్‌కు బీ ఫారం ఇచ్చారు. నందిపేట-2 స్థానం నుంచి మహమూద్ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. మాక్లూర్‌లో 17 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ముల్లంగి ‘బీ’ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఫర్జానా బేగం, మాక్లూర్-2 స్థానానికి టీడీపీ నుంచి కోక హైమద్‌ను పోటీలో నిలిపారు.
కామారెడ్డి బల్దియా బరిలో
కామారెడ్డిటౌన్ : కామారెడ్డి మున్సిపాలిటీలో 33 వార్డులుండగా 184 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అందులో 30 మంది మైనారిటీలు. 5, 6, 8, 31 వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పున, 3, 17 వార్డుల్లో ఇద్దరు చొప్పున, 2, 19, 20, 21 వార్డుల్లో ముగ్గురు చొప్పున, 22, 23 వార్డులో ఐదుగురు చొప్పున మైనారిటీలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
‘స్థానిక’ బరిలో మైనారిటీలు
Published Fri, Mar 28 2014 2:51 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement