సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి నేటి తో తెరపడనుంది. సుమారు 14 రోజుల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగియగా, బుధవారం పోలింగ్ జరగనుంది. నా మినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ మొదలు కుని ఎన్నికల ప్రచారం ముగింపు వరకు ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీ య ఘటనలకు తావు లేకుండా అధికారయంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది.
జిల్లాలోని రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో 18,52,970 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. 2,057 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరగనుండగా, ఇందుకోసం 5,332 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా(ఈవీఎం)లను ఏర్పాటు చేశారు. 25 మంది ప్రిసైడింగ్, 28 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతో పాటు 15,886 మంది సిబ్బందిని నియమించారు. నిజామాబాద్, జహీరాబాద్ లోక్‌సభ బరిలో 26 మంది, తొమ్మిది అసెంబ్లీ స్థానాల నుంచి 101 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
2009.. 2014 ఎన్నికల షెడ్యూలులో తేడా
2009 సార్వత్రిక ఎన్నికలతో 2014 ఎన్నికల షెడ్యూల్ ను పోలిస్తే తేదీలు అటు ఇటుగా ఉండగా, ఓట్ల లెక్కిం పు మాత్రం ఒకే తేదీన జరగనుంది. 2009లో ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి రెండున విడుదల చేస్తే, ఈ సారి ఐదున ప్రకటించారు. 2009లో నోటిఫికేషన్ మార్చి 23న జారీ కాగా ఈసారి పది రోజులు ఆలస్యంగా ఏప్రిల్ రెండు జారీ చేశారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన తేదీలలోనూ కొంత తేడా ఉంది. గత ఎన్నికలకు పోలింగ్ ఏప్రిల్ 16న జరిగితే, ఈసారి ఏప్రిల్ 30న జరగనుంది. అయితే, 2009, 2014 ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 16 కావడం విశేషం.
ఇదీ పరిస్థితి
మొత్తం ఓటర్లు : 18,53,288
పురుషులు : 8,97,062
మహిళలు : 9,55,798
ఇతరులు : 110
సైనికులు : 318
పోలింగ్ కేంద్రాలు : 2,057
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు : 5,332
ప్రిసైడింగ్ అధికారులు : 2,528
అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు : 2,525
పోలింగ్ సిబ్బంది : 10,832
మొత్తం సిబ్బంది : 15,885
నేడే పోలింగ్ అంతా సిద్ధం
Published Wed, Apr 30 2014 2:34 AM | Last Updated on Wed, Sep 26 2018 5:38 PM
Advertisement