సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ అధ్యక్ష పదవి రేసులో సునీతా మహేందర్‌రెడ్డి మరోసారి నిలిచారు. 2006లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరుఫున గెలిచిన ఆమె జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. బంట్వారం జెడ్పీటీసీగా రాజకీయ ప్రవేశం చేసిన ఆమె... మహిళా(జనరల్) కోటాలో జెడ్పీ పీఠాన్ని అధిష్టించారు. ఇటీవల ఆమె భర్త, ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన నేపథ్యంలో సునీత కూడా ఆయన బాటను అనుసరించారు. తాజాగా యాలాల జిల్లా ప్రాదేశిక స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి జిల్లా పరిషత్ రిజర్వేషన్ జనరల్‌కు ఖరారు కావడంతో కాంగ్రెస్, టీడీపీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాయి.
ఈ క్రమంలోనే నవాబ్‌పేట మండలం నుంచి కొం పల్లి ఆనంతరెడ్డిని నిలపాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. కాంగ్రెస్ కూడా జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి పేరును ప్రకటించడం, ఆయనా ఇదే మండలం నుంచి పోటీకి దిగడంతో ఆనంతరెడ్డి వెనక్కితగ్గారు. స్థానిక టీఆర్‌ఎస్‌లో నెలకొన్న గ్రూపులు కూడా పార్టీ గెలుపుపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న తరుణంలో సునీతను చైర్‌పర్సన్‌గా అభ్యర్థిగా ప్రకటించేందుకు టీఆర్‌ఎస్ సుముఖత చూపుతోంది. శనివారం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన జిల్లా ముఖ్యుల సమావేశంలో ఈమె పేరును అధికారికంగా ఖరారు చేసే అవకాశముంది.
టీఆర్‌ఎస్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా సునీత!
Published Fri, Mar 21 2014 11:16 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement