గంగాధర సభలో మాట్లాడుతున్న కేసీఆర్
జగిత్యాల జిల్లా ఏర్పాటు
పండ్ల మార్కెట్ అభివృద్ధి
మాడ్రన్ కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు
ధర్మపురి పుష్కరాలకు రూ.500 కోట్లు
కోరుట్ల, మెట్‌పల్లిలో నిజాం షుగర్స్‌కు అనుబంధ ఫ్యాక్టరీలు
ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు నీరు
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హామీలు
జిల్లాలో సుడిగాలి పర్యటన విజయవంతం
సాక్షి, కరీంనగర్ : టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను వంద శాతం నెరవేర్చడంతో పాటు కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం కేసీఆర్ జిల్లాలో నిర్వహించిన సుడిగాలి పర్యటన విజయవంతమైంది. ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఎ న్నికల బహిరంగ సభల్లో పాల్గొన్నారు.
పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించా రు. కోరుట్ల నుంచి మొదలైన కేసీఆర్ పర్యటన ధర్మపురి, జగిత్యాల, గంగాధర (చొప్పదండి), కథలాపూర్ (వేములవాడ), తిమ్మాపూర్ (మానకొండూర్), హుజూరాబాద్), మంథని మీదు గా పెద్దపల్లి వరకు సాగింది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ లక్ష్యంగా కేసీఆర్ ప్రసంగాలు కొనసాగా యి. కరీంనగర్ జిల్లాలో గ్రామగ్రామాన నీళ్లు వచ్చేలా సిద్దిపేట తరహాలో మంచినీటి పథకా న్ని ఏర్పాటు చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని సర్కారు స్వాధీనం చేసుకుంటుందని, కోరుట్ల, మెట్‌పల్లిలో నిజాం షుగర్స్‌కు అనుబంధ ఫ్యాక్టరీలను నెలకొల్పి ఉ పాధి కల్పిస్తామన్నారు. జగిత్యాలను జిల్లా కేం ద్రంగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. ఉత్తర తెలంగాణ పండ్ల మార్కెట్‌గా జగిత్యాల మార్కెట్‌ను అభివృద్ధి చేస్తానని, మాడ్రన్ కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. జగిత్యాలలో ఇళ్ల నిర్మాణానికి తానే స్వయంగా వచ్చిముగ్గు పోస్తానన్నారు. ఎస్సారెస్పీ నీటిని చివరి ఆయకట్టు భూమికి అందడానికి 20 వేల క్యూసెక్కుల పరిమితి పెంచుతామని వివరించారు.
ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలు సా గయ్యేట్లుగా కుర్చీ వేసుకుని ప్రాజెక్ట్‌లు కట్టిస్తానని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే ధర్మపురిలో గోదావరి పుష్కరాలకు రూ.500 కో ట్లు కేటాయిస్తామన్నారు. పుష్కరస్నానం కూడా ఇక్కడే చేస్తానన్నారు. తెలంగాణ ప్రజలకు మే లు చేయాలనే లక్ష్యంతో తయారు చేసిన మేని ఫెస్టో గాలి కబుర్లది కాదని, అనేక మంది మేధావులు, ఆర్థిక నిపుణులు, ఐఏఎస్‌లతో చర్చించి రూపొందించామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను చెప్పిన మాటలనే మేనిఫెస్టోలో పొందుపర్చామన్నారు.
రైతులకు రూ. లక్ష రుణం మాఫీ చేస్తామని, బలహీనవర్గాలు ఆత్మగౌరవంతో బతికేలా పక్కా ఇళ్ల నిర్మాణం చేపడతామని, మానవీయ కోణంలో వృద్ధులు, వితంతువులు రూ.వెయ్యి, వికలాంగులకు రూ. 1500 పింఛన్ ఇస్తామని, మహిళా సంఘాలకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామ ని, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేసి, తండాలన్నీ గ్రామపంచాయతీలుగా గుర్తిస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం కోసం పద్నాలుగేళ్లుగా లాఠీచార్జీలు, తుపాకి తూటాలకు గురయ్యాం.. దీక్షలు చేశాం.. కేసుల పాల య్యాం.. రాష్ర్ట కలను సాకారం చేసుకున్నాం.. తెలంగాణ ప్రజల తలరాతను మార్చే ఎన్నికలివి.. ఏ మాత్రం ఏమరుపాటు వహించినా.. సన్నాసుల చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టినా.. అధోగతి పాలు తప్పదని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
నా తర్వాత స్థానం ఈటెలదే..
టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తన తర్వాత స్థానం ఈటెల రాజేందర్‌కే దక్కుతుందని కేసీఆర్ అన్నారు. అప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు. ఇంతకాలం ఉద్యమంపై దృష్టి పెట్టడం వల్ల కొన్ని సమస్యలు మిగిలి ఉన్నాయని, ఈటెల మంత్రి అయిన తర్వాత అన్నింటినీ పరిష్కరిస్తారని చెప్పారు. ఈ ఒక్కసారి అవకాశం కల్పిస్తే మీకే అర్థమవుతుందన్నారు. మాట ఇచ్చి తప్పే సంస్కృతి టీఆర్‌ఎస్ నాయకులకు లేదన్నారు.
కంటతడిపెట్టిన తుల ఉమ
వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్‌లో జరిగిన సభలో టీఆర్‌ఎస్ రాష్ట్ర మహిళ విభాగం అధ్యక్షురాలు తుల ఉమను స్టేజీపైకి పిలవకపోవడంతో ఆమె కంటతడిపెట్టారు. దీంతో స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు అనూప్‌రావు ఆమెను స్టేజీపైకి తీసుకువచ్చారు.
రెండేళ్లలో లక్ష ఎకరాలకు సాగునీరు
మానకొండూర్ నియోజకవర్గంలో రెండేళ్లలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామని కేసీఆర్ అన్నారు. వేములవాడ, సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తామన్నా రు. ఎల్‌ఎండీ, మిడ్ మానేరు ద్వారా పది టీఎం సీల నీరు వాడుకోవడానికి ఆలోచిస్తామన్నారు.
మతసామరస్యానికి ప్రతీక..
నిజాంల కాలంలో హిందూ ముస్లింలు కలిసి ఉండడాన్ని చూసిన మహాత్మాగాంధీ ఎంతో ఆనందపడ్డారని, ఇదే పరిస్థితి గుజరాత్‌లో ఉం టే బాగుండేదని ఆనాడు హైదరాబాద్‌లో జరిగి న వివేకవర్దిని సభలో అన్నారని కేసీఆర్ జగి త్యాల సభలో గుర్తుచేశారు. ఆయనిక్కడ సుమా రు పది నిమిషాలు ఉర్దూలో ప్రసంగిచారు.