ఎందుకిలా..?
ఎందుకిలా..?
Published Sun, Apr 6 2014 3:30 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ‘ఎక్కడైనా పోటీ చేయ్. కానీ రాజులు పోటీ చేసే చోట వద్దు. వారితో పోటీ పడొద్దు. భవిష్యత్‌లో కూడా అటువంటి ఆలోచనకు పోవద్దు.’ బొత్స సత్యనారాయణకు ఆయన తండ్రి బొత్స గురునాయుడు చేసిన హితబోధ ఇది. జిల్లాలో ఎప్పటి నుంచో ఇది ప్రచారంలో కూడా ఉంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు బొత్స సత్యనారాయణ గాని, ఆయన కుటుంబసభ్యులు గాని రాజులుపై పోటీ చేసిన దాఖ లాలు లేవు.రాజకీయంగా బొత్సకు ప్రజాదరణ ఉన్నప్పుడు కూడా ఆయన రాజులతో పోటీకి దిగలేదు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో పాటు బొత్స పరి స్థితి కూడా పూర్తిగా దిగజారింది. ఈ పరిస్థితుల్లో ఆయన రాజులతో పోటీకి సై అంటున్నారు.
దీనిపై జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మూడుసార్లు జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేశారు. అందులో రెండుసార్లు టీడీపీ కి చెందిన కొండపల్లి పైడితల్లినాయుడు చేతిలో ఓట మి పాలవ్వగా, ఒకసారి పడాల అరుణతో పోటీ పడి గెలిచారు. ఇక ఎమ్మెల్యేగా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసి, టీడీపీకి చెందిన గద్దే బాబూరావుపై విజయం సాధించారు. ఇక, బొత్స ఝాన్సీలక్ష్మి బొబ్బిలి లోకసభ ఉప ఎన్నికలో నూ, 2009 సార్వత్రిక ఎన్నికల్లోనూ కొండపల్లి పైడితల్లినాయుడు కుమారుడు అప్పలనాయుడిపై పోటీ చేసి గెలుపొందారు. బొత్స సత్యనారాయణ సోద రుడు అప్పలనర్సయ్య కూడా గత ఎన్నికల్లో గజపతినగరం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పడాల అరుణపై విజయం సాధించారు.
బొత్సకు సోదర సమానుడైన బడ్డుకొండ అప్పలనాయుడు గత ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి పతివాడ నారాయణ స్వామినాయుడిపై గె లుపొందా రు. ఇలా చట్టసభలకే కాదు.. జెడ్పీ చైర్‌పర్సన్‌గా బొత్స ఝా న్సీలక్ష్మి ఎన్నికైన సమయంలోనూ, బొత్స సత్యనారాయణ డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికైనప్పుడు కూడా రాజులతో పోటీ పడిన దాఖలాల్లేవు. కానీ, ఈసారి అందుకు భిన్నంగా పోటీ చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. అధిష్టానం తమ మాట వినలేదోమో గాని రాజులు పోటీ చేసిన చోట బొత్స ఝాన్సీలక్ష్మిని బరిలోకి దించుతోంది. దీంతో బొత్స కుటుంబీకులు తొలిసారిగా రాజులతో పోటీ పడే పరిస్థితి నెలకొంది. ఈ ఎన్నికల్లో విజయనగరం పార్లమెంట్ నుంచి వైఎస్సార్ సీపీ తరఫున బొబ్బిలి రాజైన బేబీనాయన పోటీ చేస్తుం డగా, టీడీపీ తరఫున పూసపాటి అశోక్ గజపతిరాజు బరిలోకి దిగుతున్నారు. అటు విజయనగరం, ఇటు బొబ్బిలి రాజుల
మధ్య పోటీ నెలకొనడం ఒక ప్రత్యేకత అరుుతే ఇప్పుడు బొత్స ఝాన్సీలక్ష్మి వారితో ఢీకొనడానికి సిద్ధమవడం మరో ప్రత్యేకత. అంతేకాదు చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ బరిలోకి దిగిగే.. టీడీపీ నుంచి కె.టి.త్రిమూర్తుల ాజుకి టిక్కెట్ ఇస్తే అక్కడ కూడా రాజులతో ఢీకొనే పరిస్థితి నెలకొంది. అదే జరిగితే భార్య భర్తలిద్దరూ ఒకేసారి రాజులతో పోటీ పడుతున్నట్టు అవుతోంది. రాజులతో పోరులో వారు ఏ మేరకు ప్రభావం చూపిస్తారో, బొత్స గురునాయు డు ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారో తేట తెల్లం కానుంది.
Advertisement
Advertisement