ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: దేశంలో, రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేత, పాక్షికంగా ఆంక్షల సడలింపు ఇతర అంశాలతో నిమిత్తం లేకుండా అందరూ కరోనా నుంచి రక్షణకు సుదీర్ఘకాలం పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే! ఈ మహమ్మారి నుంచి సురక్షితులమని, తమకు మినహాయింపు ఉంటుందని ఎవరూ భావించొద్దు.. ప్రతి ఒక్కరూ అన్నిరకాల ముందస్తు చర్యలు చేపట్టాల్సిందే. మాసు్కలు కట్టుకోవడం, శానిటైజర్ల వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత, మనుషుల మధ్య దూరం పాటించడం వంటివి కనీసం ఏడాది పాటు కొనసాగించాల్సిందే.
సాధారణ జలుగు, దగ్గు రూపంలో మామూలు ఫ్లూ మాదిరిగా సోకినా ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా కనీసం మనకు సోకిందని తెలియకుండా ఈ వైరస్ వెళ్లిపోయేందుకు, దానికి అందరూ అలవాటు పడటానికి మరికొంత కాలం (మరో సంవత్సరం) పడుతుంది. కరోనా మహమ్మారి గురించి నిష్ణాతులైన వైద్యులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చడమే కాకుండా పలు హెచ్చరికలు కూడా చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ముఖ్యంగా కేన్సర్, కిడ్నీ, ఇతర రోగులు ఎలాంటి పద్ధతులు పాటించి సురక్షితంగా ఉండాలన్న దానిపై వివిధ రోగాలకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలు చేసింది. వివిధ అంశాలకు సంబంధించి డాక్టర్లు ఇచ్చిన సలహాలు, వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే..
షుగరున్న వారికి సమస్యలు
‘డయాబెటిస్, హైపర్ టెన్షన్‌తో పాటు గుండె, ఊపిరితిత్తుల వ్యాధి ఉన్న వారు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడే అవకాశాలున్నాయి. షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి. వేళకు మందులు వేసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవాలి. మనుషుల మధ్య దూరాన్ని పాటిస్తూ, పరిశుభ్రత పాటించాలి. లాక్‌డౌన్‌తో 60 ఏళ్లకు పైబడిన వారు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఇళ్లలోనే కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయాలి. అన్‌కంట్రోల్డ్ షుగర్ ఉన్న వారిలో కాంప్లికేషన్లు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చైనా, అమెరికా, ఇటలీ, స్పెయిన్ తదితర పశి్చమ దేశాల్లోని డయాబెటిస్, బీపీ వంటి ఆరోగ్య సమస్యలున్న పెద్ద వయసు్కల్లో ఈ వైరస్ ఎక్కువ మందికి సోకినట్లు, ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు తేలింది.
– బెట్రైస్ ఆనీ, నిమ్స్ హెచ్‌వోడీ, ఎండోక్రైనాలజీ అండ్ డయాబెటిస్
మరో రెండేళ్లు ఇదే పరిస్థితి
‘మరో రెండేళ్ల దాకా ఏదో ఒక రూపంలో ఈ వైరస్ బయటపడుతూనే ఉండే అవకాశాలున్నాయి. వ్యాక్సిన్ రావడానికి ఏడాది, ఏడాదిన్నర పట్టొచ్చు. అందరూ అన్ని జాగ్రత్తలూ తీసుకోవాల్సిందే. లాక్‌డౌన్ ఎత్తేశాక కూడా సినిమా హాళ్లు, మాల్స్ వంటివి ఉండవు కాబట్టి మతపరమైన అంశాలతో పాటు సమూహాలు ఒక్కచోట గుమికూడకుండా, విదేశీయాత్రలు, విహార యాత్రలకు వెళ్లకుండా, పెళ్లిళ్లలో ఎక్కువ మంది గుమిగూడకుండా చూసుకోవాలి. యువత, ఆరోగ్యవంతులైన వారి ద్వారానే ఈ వైరస్ వ్యాపిస్తున్నందున వారు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. వారిపై ఇది పెద్దగా ప్రభావం చూపకపోయినా వారి ఇళ్లలో, బయటా పెద్ద వయసున్న వారు, ఏదైనా జబ్బు బారిన వారికి ప్రాణాంతకంగా మారే ప్రమాదముంది.’
– డా.యలమంచిలి రవీంద్రనాథ్, జనరల్ సర్జన్ (ఖమ్మం)
కిడ్నీ పేషెంట్లు బయటకు రావొద్దు
‘కిడ్నీ పేషెంట్లు ఎవరూ అస్సలు బయటకు రావొద్దు. మందులు అస్సలు మానేయొద్దు. ఇళ్లలోనూ క్వారంటైన్ పాటించాలి. ఎవ్వరినీ కలవొద్దు. జలుబు, దగ్గు, విరేచనాలు వంటివి ఉన్నా, వైరస్ సోకడంపై ఏ మాత్రం అనుమానం అనిపించినా బ్లడ్‌టెస్ట్ చేసుకోవాలి. డాక్టర్‌ను సంప్రదించాలి. మాసు్కలు, శానిటైజర్లు వాడుతూ.. పరిశుభ్రంగా ఉండాలి. కిడ్నీ వ్యాధి ఉన్నవారు, డయాలసిస్ చేయించుకుంటున్న వారు, కిడ్నీ మారి్పడి చేయించుకున్న వారు.. డాక్టర్ల సూచనల మేరకు తమకు సూచించిన ఆహారాన్ని, పండ్లను, కూరగాయలు, నాన్‌వెజ్, పండ్ల రసాలు తీసుకోవాలి.’
– డా.భూషణ్‌రాజు, నిమ్స్ ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్
కళ్ల కలక వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి
‘కంజెక్టివిటీస్/మద్రాస్ ఐ వంటి కళ్ల కలక ఎవరికి వచ్చినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. దగ్గు, జలుబుతో పాటు కంటి ఇన్ఫెక్షన్లు, జ్వరంతో పాటు కళ్లు ఎర్రబడటం వంటి లక్షణాలతో కూడా ఈ వైరస్ సోకే అవకాశాలున్నాయి. కళ్ల కలక వచి్చన వారు వెంటనే ఐసోలేషన్ పాటించాలి. చేతులతో కళ్లను తాకినప్పుడు, ఎదుటివారి తుంపరలు (డ్రాప్‌లెట్లు) పడినప్పుడు, అప్రయత్నంగా కళ్లు నలుపుకున్నపుడు చాలా వేగంగా ఇది వ్యాపిస్తుంది. అయితే దీని నుంచి రికవరీ కూడా బాగానే ఉంది. దీని వ్యాప్తికి వాతావరణ పరిస్థితులు కూడా దోహదం చేస్తున్నందున, వర్షాకాలంలో ఇది మరింత తీవ్రరూపం తీసుకోవచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలం తర్వాత చలికాలం కూడా దీని విజృంభణకు తోడ్పాటునిచ్చే అవకాశాలున్నందున అందరూ కచి్చతమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.’
–డా. దీప, కంటి వైద్య నిపుణురాలు
ఒక్కరోజు కూడా మందులు మానొద్దు
గుండె జబ్బున్న వారు ముఖ్యంగా స్టెంట్ వేసిన వారు, శస్త్రచికిత్స చేయించుకున్న వారు రొటీన్‌గా వేసుకునే మందులు ఒక్కరోజు కూడా గ్యాప్ రానివ్వొద్దు. స్టెంట్ పడిన వారు ఒక్కరోజు మందులు మానినా దాని ప్రభావం పడుతుంది. ప్రస్తుతం ఇళ్లలోనే ఉండటం వల్ల కాలక్షేపానికి ఏదో ఒకటి తినడం, వ్యాయామం చేయకపోవడం కూడా ప్రభావం చూ పే అవకాశాలున్నాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, పండ్లు, తాజా కూరగాయాలు వంటివి తీసుకోవాలి. యాంగ్జయిటీ, డిప్రెషన్‌కు గురికాకూడదు. ధ్యానం, మంచి సంగీతం వినాలి. గుండెనొప్పి వస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి, పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటే వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఫోన్ లేదా టెలీ మెడిసిన్ ద్వారా డాక్టర్ల సలహా ప్రకారం మందులు మార్చడం, డోస్‌ను పెంచడం చేయాలే తప్ప సొంతంగా డోస్ పెంచుకోవద్దు.
– డా. డి.శేషగిరిరావు, ప్రముఖ కార్డియాలజిస్ట్
గర్భిణులకు 4 విజిట్స్ చాలు
‘వైరస్ సొకేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు ఆసుపత్రులకు నాలుగు విజిట్లకు వస్తే సరిపోతుంది. ఇంట్లో కూడా వారు మనుషుల మధ్య 4 అడుగుల దూరం పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ఆన్ లౌన్, బయటి ఆహార పదార్థాలను తీసుకోవద్దు. ఇళ్లలో వండిన వేడి వేడి ఆహారాన్నే తీసుకోవాలి. ప్రతి అర గంటకు ఒకసారి చేతులు సబ్బుతో కడుక్కోవాలి. ఇళ్లలోని డోర్ నాబ్ లను స్పిరిట్‌తో శుభ్రం చేస్తుండాలి. మ హిళలు, వృద్ధులు, మధుమేహం, హైపర్ టెన్ష న్ ఉన్న స్త్రీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.’
– డా.కృష్ణవేణి, గైనకాలజిస్ట్
కేన్సర్ రోగులూ.. ఫ్రిడ్జ్‌లోనివి తినవద్దు
‘కేన్సర్ పేషెంట్లు చల్లటి పదార్థాలు ముఖ్యంగా ఫ్రిజ్‌లో ఉంచిన ఆహార పదార్థాలు అస్సలు తీసుకోవద్దు. వేళకు వేడి వేడి సూప్‌లు, ప్రోటీన్లున్న తాజా ఆహారం, కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. రోజుకు 3,4 సార్లు బట్టలు మార్చుకోవాలి. వారి బట్టలను ఉతికాక ఎండలో ఆరేలా చూడాలి. ఈ వైరస్ వ్యాప్తి గురించి అనవసర భయాందోళనలకు గురికావొద్దు. వేడి నీటితో తరచుగా పుక్కిలించాలి. ప్రతిరోజూ శ్వాస సంబంధ వ్యాయామాలు చేయాలి. వీరికి నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో త్వరగా ఈ వైరస్ బారిన పడే అవకాశాలున్నాయి. మా ఆస్పత్రిలో ఇన్‌పేషంట్లకు ప్రతిరోజూ చెకప్‌లు నిర్వహించి ఏ కొంచెం అనుమానమున్నా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం.’
– డా.జయలత, ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి డైరెక్టర్
చదవండి:
కేసీఆర్ తాత నిన్ను పాస్ చేసిండుపో..
చైనా పీపీఈ కిట్లు నాసిరకం!
Comments
Please login to add a commentAdd a comment