► మిద్దె తోటల్లో, పెరటి తోటల్లో – మునగ చెట్టును తప్పనిసరిగా పెంచుకోవాలి.
► తోటలో మునగ చెట్టు ఉంటే, ఒక కాయగూర – ఒక ఆకుకూర చెట్టు ఉన్నట్టు!
► కాయలనూ–ఆకునూ వినియోగించుకోవచ్చు.
► మునగ బహుళ ప్రయోజనకారి. సులభంగా పెరుగుతుంది. తొందరగా కాపునకు వస్తుంది.
► మునగ చెట్టును పెంచడంలో ఒక జాగ్రత్త తీసుకోవాలి. చెట్టును గుబురుగా పెంచాలి.
► ప్రతి అడుగు ఎత్తు పెరిగినప్పుడల్లా.. కొమ్మల చివరలను తుంచాలి. తుంచిన చోట, తిరిగి రెండు చివుళ్లు వస్తాయి.
► అలా ఎప్పుడూ చేస్తూ ఉండాలి!
► దానివల్ల చెట్టు ఎక్కువ కొమ్మలతో గుబురుగా పెరుగుతుంది. ఆకు కోసి కూర వండుకోవచ్చు. లేనట్లయితే, చెట్టు నిటారుగా పెరుగుతుంది. విరిగిపోయే అవకాశాలు ఉంటాయి.
► చిన్న మొక్కల పూతను కూడా తుంచెయ్యాలి. లేకపోతే చెట్టు ఎదగదు!
► మొక్క నాటిన లేదా విత్తనం వేసిన తర్వాత కనీసం, ఆరేడు నెలలు పూతను తుంచెయ్యడంవల్ల చెట్టు బలంగా ఎదుగుతుంది. అలా ఎదిగాక పూతను ఉంచాలి!
– తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దె తోటల నిపుణులు
f:/Tummeti Raghothama Reddy
1. మునగ మొక్క సన్నగా, నిటారుగా పెరుగుతుంటుంది.
2.3. కొమ్మల చివరలను, లేత మొక్కల పూతను తుంచుతూ ఉంటే.. ఎక్కువ కొమ్మలు వస్తాయి.
4. గుబురుగా పెరిగిన మునగ మొక్క నుంచి ఆకును కోసుకోవచ్చు.
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment