పోర్న్‌ స్టార్‌లను చూసి గతుక్కుమని.. | New Zealand Pornography TV Add For Children Keep it Reality Series | Sakshi
Sakshi News home page

చెప్పడానికి వచ్చాం

Jun 18 2020 8:58 AM | Updated on Jun 18 2020 10:55 AM

New Zealand Pornography TV Add For Children Keep it Reality Series - Sakshi

టీవీ యాడ్‌

మేము మీ అబ్బాయిని కలవొచ్చా?’ అని  ఒక స్త్రీ, ఒక పురుషుడు జంటగా ఒక ఇంటి ముందుకు వచ్చి ఆ ఇంట్లోని టీనేజ్‌ కొడుకు తల్లిని అడుగుతారు. ఒంటి మీద బట్టలు లేకుండా వాకిట్లో చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఆ ఇద్దరినీ చూసి తల్లి  నిశ్ఛేష్టురాలు అవుతుంది.. ‘హాయ్‌.. మేమిద్దరం మీ అబ్బాయికి బాగా తెలిసిన వాళ్ళం. అతడు మమ్మల్ని ల్యాప్‌టాప్‌లో, ఐ ప్యాడ్‌లో, ప్లే స్టేషన్లో, తన ఫోన్లో, మీ ఫోన్‌లో కూడా రోజూ చూస్తుంటాడు. అయితే అతడు చూస్తున్న విధంగా నిజజీవితంలో ఉండదని అతడికి చెబుదామని వచ్చాం’ అంటారు. ఈలోపు ఆ టీనేజ్‌ కొడుకు కూడా లోపలిని నుంచి వస్తూ  తల్లితో మాట్లాడుతున్న ఆ ఇద్దరు పోర్న్‌ స్టార్‌లను చూసి గతుక్కుమని చేతిలోని బౌల్‌ని కిందపడేసుకుంటాడు. వాళ్లు అతడికి చెప్పాల్సిది చెప్పి, బై చెప్పి వెళ్లిపోతారు. న్యూజీలాండ్‌ ప్రభుత్వం ‘కీప్‌ ఇట్‌ రియల్‌’ సీరీస్‌ పేరుతో ఇస్తున్న టీవీ యాడ్స్‌ లో ఇదీ ఒకటి. హాస్యం, సీరియస్‌ సందేశం కలిపి వివిధ అంశాలపై న్యూజిలాండ్‌ కొన్నాళ్లుగా తన పౌరుల్ని చైతన్యవంతుల్ని చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement