అష్టాదశ శక్తిపీఠాలు ఏవి?
తెలుసుకుందాం
భారత ఉపఖండంలో శక్తిపీఠాలు చాలానే ఉన్నా, అష్టాదశ శక్తిపీఠాలు ముఖ్యమైనవి. వీటినే మహాశక్తి పీఠాలని కూడా అంటారు. ఇవి వరుసగా...
1. శాంకరీదేవి తృణకోమలి, శ్రీలంక
2. కామాక్షీదేవి కంచి, తమిళనాడు
3. శృంఖలాదేవి పాండువా, పశ్చిమబెంగాల్
4. చాముండేశ్వరీదేవి మైసూరు, కర్ణాటక
5. జోగులాంబాదేవి ఆలంపూర్, తెలంగాణ
6. భ్రమరాంబికాదేవి శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్
7. మహాలక్ష్మీదేవి కొల్హాపూర్, మహారాష్ట్ర
8. రేణుకాదేవి మహుర్, మహారాష్ట్ర
9. మహాకాళీదేవి ఉజ్జయిని, మధ్యప్రదేశ్
10. పురుహూతికాదేవి పిఠాపురం, ఆంధ్రప్రదేశ్
11. బిరజాదేవి జాజ్‌పూర్, ఒడిశా
12. మాణిక్యాంబాదేవి ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్
13. కామరూపాదేవి గువాహటి, అసోం
14. మాధవేశ్వరీదేవి ప్రయాగ, ఉత్తరప్రదేశ్
15. వైష్ణవీదేవి కాంగ్రా, జ్వాలాముఖి, హిమాచల్‌ప్రదేశ్
16. సర్వమంగళాదేవి గయ, బీహార్
17. విశాలాక్షీదేవి వారణాసి, ఉత్తరప్రదేశ్
18. సరస్వతీదేవి కాశ్మీర్