నల్లధనం నిర్మూలిస్తామని, ప్రతి భారతీయుడికీ బ్యాంకు ఖాతాలో లక్షలాది రూపాయలు అప్పనంగా అప్పగిస్తామని ఆశలు రేపి అధికారానికి వచ్చిన కేంద్ర పాలకులు ఇప్పుడు మధ్యతరగతి బతుకులతో ఆటలాడుకుంటున్నారు. నల్లడబ్బు నిర్మూలనను ఎప్పుడో గాలికి వదిలేశారు. ప్రజల ఖాతాల్లోంచి అవసరమైన డబ్బులు కూడా తీసుకోనీయకుండా వారి కనీస స్వేచ్ఛను కూడా హరింపచేస్తూ ఆర్థిక వ్యవస్థను, ప్రజల అవసరాలను అతలాకుతలం చేస్తున్నారు. న్యాయంగా తాము సంపాదించిన డబ్బును కూడా బ్యాంకుల్లో నుంచి తీసుకోకుండా చేయడం, పెద్ద నోట్ల రద్దు జరిగి సంవత్సరం ముగిసిన తర్వాత కూడా జనం డబ్బుకు కటకటలాడటం.. ఇవన్నీ అచ్చేదిన్‌లో భాగమేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు?
Comments
Please login to add a commentAdd a comment