జీహెచ్ఎంసీలో భారీగా నామినేషన్లు
Published Sat, Jan 16 2016 12:59 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం జోరందుకుంది. రెండు రోజుల మాత్రమే మిగిలి ఉండటంతో శనివారం భారీగా నామనేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కాగా నామినేషన్లు వేసేందుకు వెళ్తున్నఅభ్యర్థులు, వారి అనుచరగణంతో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రామంతపూర్, కూకట్ పల్లి, జేఎన్టీయూ, ఉప్పల్ లోని వీటి కమాన్ ప్రాంతాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
నామినేషన్ల దాఖలు చేసిన అభ్యర్ధులు
- బంజారాహిల్స్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు కుమార్తె విజయలక్ష్మీ నామినేషన్ వేశారు.
- జాంబాగ్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇదే డివిజన్ లో ఎంఐఎం అభ్యర్థిగా కాంగ్రెస్ మాజీ నేత డి.మోహన్ నామినేషన్ వేశారు.
- మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు విజయశాంతి ఆల్వాల్‌లో టీఆర్‌ఎస్ తరపున నామినేషన్ వేశారు. కార్యకర్తలతో ర్యాలీగా తరలి వెళ్లే ముందు ఆమె మామకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు.
- మెహదీపట్నం డివిజన్ ఎమ్ఐఎమ్ అభ్యర్థిగా మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ నామినేషన్ దాఖలు చేశారు.
- గుడి మల్కాపూర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బంగారు ప్రకాష్ నామినేషన్ వేశారు.
- కేపీహెచ్బీ కాలనీ డివిజన్ టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా జనగాం సురేష్ రెడ్డి నామినేషన్ వేశారు.
Advertisement