2వ రోజు 79 నామినేషన్లు | 79 nominations for the 2nd day | Sakshi
Sakshi News home page

2వ రోజు 79 నామినేషన్లు

Published Wed, Jan 13 2016 11:51 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

79 nominations for the 2nd day

సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రెండో రోజు 79 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో బీజేపీ నుంచి 6, కాంగ్రెస్ తరఫున 9, టీఆర్‌ఎస్  31, టీడీపీ 11, లోక్‌సత్తా 1, ఇతరులు 1, ఇండిపెండెంట్లవి 20 ఉన్నాయని అదనపు కమిషనర్ సురేంద్ర మోహన్ తెలిపారు.  తొలిరోజు 15 దాఖలయ్యాయని.. మొత్తంగా 94 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ బీఫారాలు సమర్పించకపోయినా పార్టీల అభ్యర్థులుగానే పరిగణిస్తున్నామన్నారు. ఉపసంహరణల గడువులోగా బీఫారాలు సమర్పించవచ్చన్నారు.  
 వార్డుల వారీగా ఇలా...: ఒక్కొక్క నామినేషన్: చర్లపల్లి, చిలుకా నగర్, ఉప్పల్, హయత్‌నగర్, వనస్థలిపురం, ఐఎస్‌సదన్, ఫలక్‌నుమా, గుడిమల్కాపూర్, జాంబాగ్, గన్‌ఫౌండ్రి, హిమాయత్ నగర్, అంబర్‌పేట, యూసఫ్‌గూడ . గచ్చిబౌలి, మియాపూర్, శేరిలింగంపల్లి, ఓల్డ్‌బోయినపల్లి, గాజులరామారం, రంగారెడ్డి నగర్, చింతల్, సుభాష్ నగర్, కుత్బుల్లాపూర్, మచ్చబొల్లారం, మౌలాలి, మల్కాజిగిరి, మెట్టుగూడ, సీతాఫల్‌మండి, బేగంపేట, మోండా మార్కెట్
 
రెండేసి నామినేషన్లు: నాగోల్, లింగోజిగూడ, సరూర్‌నగర్, కొత్తపేట,మైలార్‌దేవ్‌పల్లి, నల్లకుంట, వేంకటేశ్వర కాలనీ, కొండాపూర్, రామచంద్రాపురం, పటాన్‌చెరు, బాలాజీ నగర్, హైదర్‌నగర్, జగద్గిరిగుట్ట, తార్నాక.
 మూడేసి నామినేషన్లు: మన్సూరాబాద్, చంపాపేట, ఈస్ట్ ఆనంద్‌భాగ్, గౌతమ్‌నగర్.
 నాలుగేసి నామినేషన్లు: చైతన్యపురి, ఆల్విన్ కాలనీ. వీటితో పాటు గడ్డిఅన్నారం వార్డుకు 5 నామినేషన్లు దాఖలయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement