
'ఎంఐఎంతో మాకు సంబంధం లేదు'
ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: గ్రేటర్ లో ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ సద్భావన రజతోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.
గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కారకర్తలు కృషి చేయాలన్నారు. నెహ్రూ, గాంధీ కుటుంబాన్ని మోదీ ప్రభుత్వం అప్రతిష్ట పాలు చేస్తోందని విమర్శించారు. దేశానికి నెహ్రూ, గాంధీ కుటుంబాలు చేసిన సేవలను తగ్గించే కుట్ర జరుగుతోందని ఉత్తమ్ అన్నారు.