ఏటా 7.5 లక్షల రైతులు సాగుకు దూరం
సంక్షోభం దిశగా వ్యవసాయం
- వ్యవసాయరంగ సదస్సులో శాస్త్రవేత్తల హెచ్చరిక
- ఇదే పరిస్థితి కొనసాగితే వందేళ్ల తర్వాత అన్నదాతలు మిగలరు
- 8వ జాతీయ విస్తరణ విద్యా సదస్సు–2017 ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: దేశంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి నెల కొందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చ రించారు. దేశంలో సగటున రైతు నెలవారీ ఆదాయం రూ.201 మాత్రమేనని... వ్యవసాయ రంగంలో మార్పుల కారణంగా దేశవ్యాప్తంగా ఏటా 7.5 లక్షల మంది రైతులు ఆ రంగాన్ని వీడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘న్యూట్రిషియన్ సెన్సిటివ్ అగ్రికల్చర్–చేంజింగ్ రోల్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్’అనే అంశంపై 8వ జాతీయ విస్తరణ విద్యా సదస్సు–2017 శనివారం హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ (నార్మ్) ఆడిటోరియంలో ప్రారంభమైంది. ఐకార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నరేంద్ర సింగ్ రాథోడ్ సదస్సును ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పలు వ్యవసాయ యూని వర్సిటీలకు చెందిన 500 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొ న్నారు. సదస్సు ప్రారంభం సందర్భం గా ఇటీవల పద్మశ్రీ అవార్డులు పొందిన చింత కింది మల్లేశం, దరిపెల్లి రామయ్యలను నార్మ్ తరపున ఘనంగా సన్మానించారు.
అన్నదాత ఆదాయం అత్తెసరే...
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చి ప్రకారం దేశంలో సగటున ఒక రైతు నెలకు రూ. 4,623 సంపాదిస్తుండగా... దానిలో రూ. 4,422 పెట్టుబడి ఖర్చు పోను రైతుకు నెల ఆదాయం రూ. 201 మాత్రమే నని రాథోడ్ వివరించారు. ప్రభుత్వంలో పనిచేసే నాలుగో తరగతి ఉద్యోగి సగటున నెలకు రూ. 18 వేల చొప్పున... రోజుకు రూ. 600 సంపాదిస్తుంటే... రైతు ఆదా యం నెలకు రూ. 201 ఉండటం బాధాకర మన్నారు. అడ్డగోలుగా వాడుతున్న రసా యన ఎరువులు, పురుగుమందులు సైతం రైతు పెట్టుబడిని పెంచుతున్నాయన్నారు. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన 1,300 మంది వ్యవసాయ విస్తరణాధికారుల సేవలను విని యోగించుకోవాల్సి ఉందని ప్రొఫెసర్ జయ శంకర్ వ్యవసాయ వర్సిటీ వీసీ డాక్టర్ ప్రవీణ్‌రావు పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రా ల్లో రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం చాలా తక్కువగా ఉండటంతో రైతులకు పెట్టుబడి తగ్గి అధిక లాభాలు వస్తున్నాయని ఇంపాల్ సీఏయూ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ ప్రేమ్‌జిత్‌సింగ్ తెలిపారు. సదస్సులో ఐకార్–నార్మ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.కల్పనాశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
ఇలాగైతే వందేళ్ల తర్వాత రైతులు మిగలరు..
సదస్సులో డాక్టర్ నరేంద్రసింగ్ రాథోడ్ మాట్లాడుతూ దేశంలో 13.87 కోట్ల మంది రైతులుండగా వారిలో నిత్యం 2,058 మంది వ్యవసాయాన్ని వీడుతున్నారని ఒక సర్వేలో వెల్లడైందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వందేళ్లలో దేశంలో రైతులు మిగలరన్నారు. దేశంలో భవిష్యత్తు ఆహార అవసరాలకు తగ్గ ట్లుగా పోషక విలువలుగల ఆహార ఉత్పత్తి సాధించాలంటే వ్యవసాయ శాస్త్రవేత్తలు, విస్తరణాధికారులు సమన్వయంతో పనిచే యాలని సూచించారు. 2025కి దేశ జనాభా 150 కోట్లకు చేరుతుందన్న అంచనాలున్నా యని, ఆహార అవసరాలు తీర్చేందుకు 350 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు అవస రముందని రాథోడ్ తెలిపారు. 2014–15లో దేశవ్యాప్తంగా 263 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగితే... 2015–16లో 253 మిలియన్ టన్నులకు పడిపోయిందని అన్నారు.