ఆ గోస మాటల్లో చెప్పలేం.. | After reaching here agitation for the victims of Iraq | Sakshi
Sakshi News home page

ఆ గోస మాటల్లో చెప్పలేం..

Published Sun, Jul 6 2014 1:38 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఆ గోస మాటల్లో చెప్పలేం.. - Sakshi

ఆ గోస మాటల్లో చెప్పలేం..

  • హైదరాబాద్‌కు చేరుకున్నాక ఇరాక్ బాధితుల ఆవేదన
  • తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
  •  భారత ఎంబసీ సహకారంతోహైదరాబాద్‌కు వచ్చిన 78 మంది
     జీతం లేదు.. తిండీ లేదు... బతుకుతామనుకోలేదు..
     ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపినదృశ్యాలను తలుచుకుని కన్నీరు
     అంతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే.. పెప్సీ కంపెనీలో కార్మికులే

     
     సాక్షి, హైదరాబాద్: ‘‘తిండి లేదు.. సరైన నిద్రలేదు.. తిరిగి వెళ్లిపోదామంటే పైసల్లేవు.. అసలు బతుకుతామో లేదో తెలి యదు.. మా కంపెనీకి దగ్గర్లోనే బాంబులు కూడా పడ్డయి.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికినం.. ఆ గోస మాటల్లో చెప్పలేం..’’.. అంతర్యుద్ధం కారణంగా ఇరాక్‌లో చిక్కుకుని శనివారం స్వదేశానికి తిరిగి చేరుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కార్మికుల ఆవేదన ఇది. ఇరాక్ అంతర్యుద్ధంలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ గడిపిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 78 మంది కార్మికులు శనివారం మధ్యాహ్నం స్వదేశానికి చేరుకున్నారు. ఇంతకాలం బాంబుల మోత మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికిన  దృశ్యాలను తలుచుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఇరాక్ దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా వీరంతా పనిచేస్తున్న పెప్సీ కంపెనీ మూతపడడంతో జీతాల్లేక, సరైన తిండీతిప్పలు లేక నానాయాతనా అనుభవిం చారు.
     
    భారత్‌కు రావడానికి కనీసం విమానం టికెట్‌కు కూడా డబ్బులు లేని దుస్థితిలో చిక్కుకున్నా.. ఆ కార్మికులందరినీ సురక్షితంగా స్వదేశానికి పంపేందుకు భారత ఎంబసీ ఎంతో కృషి చేసింది. ఢిల్లీ నుంచి ఇరాక్‌లోని ఎర్బీల్‌కు ప్రత్యేకంగా పంపిన ఎయిర్‌ఇండియా విమానంలో ఈ కార్మికులు స్వదేశానికి వచ్చారు. వీరితో పాటు మిలిటెంట్ల చెర నుంచి విముక్తి పొందిన 46 మంది కేరళ నర్సులు కూడా ఇదే విమానంలో స్వదేశానికి వచ్చారు.

    ఇరాక్‌లోని ఎర్బీల్ నుంచి బయలుదేరిన విమానం ముందుగా ముంబైకి, అక్కడి నుంచి కొచ్చికి చేరుకోవడంతో నర్సులు అక్కడ దిగి స్వస్థలాలకు వెళ్లిపోయారు. అనంతరం ఆ విమానం మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంది. ఇందులో వచ్చిన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, గుంటూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన కార్మికులు విమానాశ్రయం నుంచి వారి స్వస్థలాలకు బయలుదేరారు. అంతకుముందు ఇరాక్‌లో తాము ఎదుర్కొన్న కష్టాలను కన్నీటితో వివరించారు.
     
    తిండి కూడా దొరకని దుస్థితి..
    నెలరోజులుగా ఇరాక్‌లో పరిస్థితి బాగాలేదు. కంపెనీలో పని నిలిచిపోయింది. తిండి కూడా దొరకని పరిస్థితి. భయానక వాతావరణం అలుముకుంది. మొత్తమ్మీద ప్రాణాలతో బయటపడ్డాం. సొం త దేశానికి రావడంతో ధైర్యం వచ్చింది.  
    - రమేష్, ఎలిగేడు గ్రామం, కరీంనగర్ జిల్లా
     
    కంపెనీ దగ్గరే బాంబులు పడ్డాయి..
    నెలరోజులుగా ఇరాక్‌లో మేం పడిన గోస మాటల్లో చెప్పలేం. కంపెనీలో పని లేదు, జీతం ఇయ్యలేదు. అప్పుడప్పుడు పెప్సీ కంపెనీ దగ్గర కూడా బాంబులు పడ్డాయి. కంపెనీ లోపలే తలదాచుకున్నాం. బతుకుదెరువు కోసం నాలుగు నెలల కిందనే రెండు లక్షలు కట్టి ఇరాక్ పోయిన. చేసిన అప్పు కూడా తీర్చలేని పరిస్థితి. ప్రభుత్వమే ఆదుకోవాలె.
    - ఆర్.ఎల్.అంజయ్య, మదనపల్లి, కరీంనగర్ జిల్లా
     
     ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం..

     భారతీయుల విడుదలపై ‘సాక్షి’తో దౌత్యాధికారి సురేష్‌కుమార్‌రెడ్డి
     
    సాక్షి ప్రత్యేక ప్రతినిధి:
    ఇరాక్‌లో అపహరణకు గురైన భారత నర్సులు, కార్మికులను తీవ్ర వాదుల చెర నుంచి విడుదల చేయించేందుకు అనేక సవా ళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇరాక్‌లో భారత దౌత్యా దికారి సురేష్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఇరాక్, కుర్దీష్ అత్యు న్నత స్థాయి అధికారులు తమకు పూర్తిస్థాయిలో సహకరిం చడం వల్ల బందీలను క్షేమంగా విడుదల చేయించ గలిగామని ఆయన వెల్లడించారు. గతంలో ఇరాక్‌లో భారత రాయబారిగా పని చేసిన సురేష్‌కుమార్‌రెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. దీంతో ఆ దేశ రాజధాని బాగ్దాద్‌కు వెళ్లిన సురేష్ బృందం.. అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల ఆచూకీ తెలుసుకోవడంతో పాటు వారు తిరిగి స్వదేశానికి వచ్చేందుకు పూర్తిస్థాయిలో కృషి చేసింది. ఈ సందర్భంగా సురేష్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడారు.
     
    ‘‘నర్సులు, కార్మికులను విడుదల చేయించ డానికి మేం చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. ఇరాక్, కుర్దీష్ అధికారులు సహకరించడంతో.. బందీలను క్షేమంగా విడిపించుకోగలిగాం. వారిని ప్రత్యేక విమానంలో వెంటనే గమ్యస్థానాలకు చేర్చాం. వారిని కుటుంబసభ్యుల వద్దకు చేర్చడం నాతో పాటు, ఇక్కడ పనిచేస్తున్న భారతీయ దౌత్య సిబ్బందికి అంతులేని ఆనందాన్ని కలిగించింది..’’ అని తన అనుభవాలను వివరించారు.

    వీలైనంత త్వరగా ఇరాక్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వస్థలాలకు చేరుస్తామని.. మరో రెండు రోజుల్లో దాదాపు రెండు వేల మందిని ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దాదాపు పదివేల మంది భారత కార్మికులు ఇరాక్‌లో పనిచేస్తున్నారని ఎంబసీ గుర్తిం చిందని, వారు పనిచేస్తున్న కంపెనీ, నివాసం తెలుసుకుని ఇప్పటికే కొంత మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిందని వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement