రెవెన్యూ అధికారులకు సీసీఎల్‌ఏ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: గ్రామ స్థాయిలోనే ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) రేమండ్ పీటర్ ఆదేశించారు. అధికారులు అందుబాటులో ఉండటం లేదంటూ.. చాలామంది గ్రామాల నుంచి హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులంతా వారికి పోస్టింగ్ ఇచ్చిన గ్రామంలోనే నివాసం ఉండాలని స్పష్టం చేశారు.
వివిధ అంశాలపై అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లతో బుధవారం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్‌మీనా, రేమండ్ పీటర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీటర్ మాట్లాడుతూ.. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ తన పరిధిలోని గ్రామాలను వారానికి ఒకసారి, తహసీల్దారు నెలకు ఒకసారైనా త నిఖీ చేయాలని, డివిజన్ పరిధిలోని గ్రామాల్లో గ్రీవెన్స్, మ్యుటేషన్ దరఖాస్తుల పెండెన్సీని ఆర్డీవోలు ఎప్పటికప్పడు సమీక్షించాలని ఆదేశించారు. సమీక్షలు నిర్వహించని ఆర్డీవోలకు చార్జిమెమోలు జారీ చేయాలని జేసీలకు సూచించారు.
గ్రామాల్లో అందుబాటులో ఉండండి
Published Thu, Feb 18 2016 12:02 AM | Last Updated on Sun, Sep 3 2017 5:50 PM
Advertisement