
ప్రభుత్వంలో ఉన్నాం కానీ పచ్చ కండువా వేసుకోలే!
హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఎన్నడూ పచ్చ కండువాలు కప్పుకోలేదని, తమది జాతీయ పార్టీఅని చెప్పుకొచ్చారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. శాసనసభలో టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలను సంపూర్ణంగా సమర్థిస్తూ..వారితో కలిసి తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బీజేపీ తీరుపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యంతరం తెలిపారు.
దీనికి ప్రతిస్పందించిన విష్ణుకుమార్ రాజు బీజేపీ జాతీయ పార్టీ అని, ఆ స్థాయి పార్టీపై విమర్శలు చేసేముందు ఆలోచించుకోవాలని పేర్కొన్నారు. సోమవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాల్సిందేనని, లేనిపక్షంలో బాయికాట్ చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సస్పెన్షన్ ఎత్తేసే ప్రసక్తేలేదని మంత్రి యనమల తెలిపారు.