‘అలా అని రాజ్యాంగంలో రాసి ఉందా?’ | Chada venkata reddy slams BJP leaders | Sakshi
Sakshi News home page

‘అలా అని రాజ్యాంగంలో రాసి ఉందా?’

Published Thu, Apr 7 2016 7:52 PM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

‘అలా అని రాజ్యాంగంలో రాసి ఉందా?’ - Sakshi

‘అలా అని రాజ్యాంగంలో రాసి ఉందా?’

హైదరాబాద్ : భారత్‌మాతాకీ జై అని అనని వాళ్లు దేశంలో ఉండకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉందా? అని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. డెబ్భై ఏళ్ల స్వతంత్ర భారతంలో భారత్‌మాతాకీ జై, వందేమాతరం ప్రస్తావన లేనేలేదన్నారు.

స్వాతంత్య్ర ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేని, గతంలోబ్రిటీష్‌వారికి తొత్తులుగా ఉన్న బీజేపీ నాయకులు అనవసరంగా భారత్‌మాతా వివాదాన్ని ముందుకు తెస్తున్నారని ఎద్దేవాచేశారు. గురువారం మఖ్దూంభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూడా బీజేపీ నాయకులు కుహనా జాతీయవాదంతో ఆయా అంశాలను ప్రస్తావిస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement