'కల్యాణలక్ష్మి' పథకంపై సీఎం కేసీఆర్ సమీక్ష | CM KCR Review meeting over 'Kalyana Lakshmi' scheme | Sakshi
Sakshi News home page

'కల్యాణలక్ష్మి' పథకంపై సీఎం కేసీఆర్ సమీక్ష

Published Thu, Jun 16 2016 3:42 PM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

CM KCR Review meeting over 'Kalyana Lakshmi' scheme

హైదరాబాద్ : పేద యువతుల వివాహాలకు ఆర్థికంగా తోడ్పాటునిచ్చే ఉద్దేశంతో తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకంపై సీఎం కేసీఆర్ గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పథకం అమలుపై ఆరా తీశారు. బీసీలకు, ఆర్థికంగా వెనుకబడినవారికి కూడా కల్యాణ లక్ష్మి పథకం అమలు చేయాల్సిందిగా తెలిపారు. దానికి సంబంధించిన మార్గదర్శకాలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఇప్పటివరకు 1,04,057 మంది యువతులకు ఆర్థిక సాయం అందిందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement