సాక్షి, హైదరాబాద్: ‘పొరుగునున్న కర్ణాటకలోని గుల్బర్గాలో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద రైతులకు బీమా అందింది. మనిషికి బీమా ఉన్నట్టుగానే పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కానీ దీన్ని రాష్ట్రంలో నీరుగార్చారు. నాబార్డ్ ద్వారా రైతు సంక్షేమం కోసం ఖర్చు చేసేందుకు రూ.11 లక్షల కోట్లు కేంద్రం కేటాయించినా రాష్ట్ర రైతులకు దాని ఫలాలు అందకుం డా పోతున్నాయి.
రూ.లక్ష రుణం తీసుకున్న రైతుల పక్షాన వడ్డీని బ్యాంకులకు చెల్లిస్తే రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్ విత్తన భాండాగారం చేస్తామన్న సీఎం మాట ఏమైంది? ఇప్పటికీ రైతులకు నకిలీ విత్తనాలే ఎందుకు దిక్కవుతున్నాయి?’ అంటూ అసెంబ్లీలో అధికార పక్షంపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. వ్యవసాయం, పౌర సరఫరాలు, పశు సంవర్థక శాఖలపై జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ ఉపనేత చింతల రామచంద్రారెడ్డి మాట్లాడారు.
ఉచిత విద్యుత్ మొదలు రైతుకు ఆర్థిక సహకారం వరకు అన్నింటా కేంద్ర సా యం ఉన్నా ఆ విషయాన్ని వెల్లడించకుండా, రైతులకు కేంద్రం ఏం చేయట్లేదని తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో రైతులకు మద్దతు ధర కాకుండా బోనస్ ప్రకటిస్తున్నారని, ఇక్కడ బేడీలేస్తున్నారని ఎద్దేవా చేశారు.
రైతులతో వర్సిటీ అనుసంధానం: ఆర్.కృష్ణయ్య
వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని రైతులతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. అప్పుడే అందులోని విద్యార్థులకు వాస్తవ విషయాలు తెలిసి భవిష్యత్తులో రైతులకు ఉపయోగపడేలా తయారవుతారని చెప్పారు.
రేషన్ కార్డులు ఇచ్చేదెప్పుడు?: సున్నం
ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం తొలగించిందని, దీంతో రేషన్ కార్డులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తెలిపారు. రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని ప్ర శ్నించారు. గిరిజన ప్రాంతాల్లో ఐదారు కిలోమీటర్లకు ఒక రేషన్ షాపు ఉండటంతో ప్రజలు ఇ బ్బందులు పడుతున్నారన్నారు. అక్కడ కి.మీ. కి ఓ రేషన్ షాపు ఏర్పాటు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment