నిపుణుల కమిటీ ఏర్పాటుచేయండి | Do set up an expert committee | Sakshi
Sakshi News home page

నిపుణుల కమిటీ ఏర్పాటుచేయండి

Published Thu, Nov 24 2016 2:13 AM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

నిపుణుల కమిటీ ఏర్పాటుచేయండి - Sakshi

నిపుణుల కమిటీ ఏర్పాటుచేయండి

ప్రధానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ
- అందులో రైతుసంఘాలు, వాణిజ్యసంఘాల ప్రతినిధులుండాలి
- గ్రామీణులకుబ్యాంకింగ్ కార్యకలాపాలు అలవాటు కావాల్సి ఉంది
- అందుకు అనువైన మార్గాలను ఈ కమిటీ సూచిస్తుంది
- పెద్దనోట్ల రద్దు అమలు తేదీని మార్చే విషయం పరిశీలించండి
- మీ నిర్ణయం మంచిదే.. అమలులోనే అన్ని ఇబ్బందులు..
 
 సాక్షి, హైదరాబాద్ : సమాజంలోని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దు అమలు తేదీ అంశాన్ని పునః పరిశీలిం చాలని ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ప్రధానికి ఆయన బుధవారం ఓ లేఖ రాశారు.  ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను అధిగమిం చడం కోసం ఆయన ప్రధానికి కొన్ని సూచనలు చేశారు. చిరు వ్యాపారులు, అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు, ఇతర అన్ని రంగాలలోని కార్మికులను దశలవారీగా బ్యాంకింగ్ కార్యకలాపాలవైపు మరల్చే మార్గాలను సూచించేందుకు గాను తక్షణమే ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధానికి జగన్ విజ్ఞప్తి చేశారు. ఆ కమిటీలో అన్ని రాజకీయపార్టీలు, రైతు సంఘాలు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, గ్రామీణ ఆర్థిక రంగ నిపుణులు ఉండాలని జగన్ సూచించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇదొక్కటే పరిష్కార మార్గమని భావిస్తున్నట్లు ప్రధానికి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకు, రాజకీయాల్లో విలువల పెంపునకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని ఒక రాజకీయ పార్టీగా మనస్ఫూర్తిగా  బలపరుస్తామని, అరుుతే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు. దేశంలో చలామణిలో ఉన్న డెబిట్, క్రెడిట్‌కార్డులు, బ్యాంక్ అకౌంట్లు, నగదు వివరాలు, గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకు శాఖల సంఖ్య సహా వివరణాత్మతంగా లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం సమాజంలో వివిధ వర్గాల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో పూర్త్తిగా పరిశీలించిన తర్వాతనే తానీ లేఖరాస్తు న్నట్లు ఆయన పేర్కొన్నారు. లేఖలోని ముఖ్యాంశాలివీ..

 మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కానీ..
 ‘‘పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అరుుతే సదుద్దేశంతో రూపొందించే మంచి ప్రణాళికలు కూడా సరిగ్గా అమలు చేయక పోతే విఫలమవుతారుు. అందుకు ఇపుడు సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామా లే నిదర్శనం. రైతులు, గ్రామీణ వ్యవసాయ కార్మికులు, చిన్న వ్యాపారులు, అసంఘటిత కార్మికులు, రోజు వారీ వేతన కూలీలు చిల్లర నగదును పొందడంలో అనేక సమస్యలెదు ర్కొంటున్నారు. రోజులు గడిచే కొద్దీ సమస్య లింకా జటిలం అవుతున్నారుు. చిన్న వ్యాపా రాలు, అసంఘటిత కార్మికులు, రీటైల్ రంగంలో పని చేస్తున్న వారు, పేదలు, ముఖ్యంగా వ్యవసాయరంగంలో ఉన్న వారి కష్టాలు ఇంకా పెరుగుతున్నారుు. పెద్ద మార్కెట్ యార్డులు, మండీలలో వ్యాపార కార్యకలాపాలు బాగా తగ్గు ముఖం పట్టారుు. ఈ కష్టాలు దీర్ఘకాలికంగా మారి సామాన్యుని జీవితంపై రోజు రోజుకూ తీవ్ర ప్రభావం చూపుతూ ఉండటంతో  వాటిని మీ దృష్టికి తెచ్చేందుకు నేనీ లేఖను రాయక తప్పడం లేదు. సామాన్యుడి జీవితం ప్రస్తుతం ఉన్న దుర్భర స్థితి కన్నా మరింత దిగజారకుండా తదుపరి చర్యలు చేపడతారని ఆశిస్తున్నా.

 ప్రజలకు తగినంత సమయం ఇవ్వండి...
 ఓవైపు ప్రజలను జాగృతం చేస్తూ మరో వైపు తగిన విధంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తూ... ఏళ్ల తరబడి అమలులో ఉన్న ఈ పురాతనమైన అలవాట్లను మార్చాల్సిన అవసరం ఉంది. 90 శాతం లావాదేవీలన్నీ నగదు ద్వారానే జరిగే పురాతన సంప్రదా యమున్న ఈ దేశంలో ప్లాస్టిక్ మనీని అమలులోకి తీసుకు రావడం అంత సులభం కాదు, ఇలా మార్పు చేయడం కష్ట సాధ్యమైన పని కనుక జనంలో అవగాహన కల్పించడం, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారానే చేయాలి. ఆస్పత్రి బిల్లులు,  రైలు, బస్సు టిక్కెట్లు , ట్యూషన్ ఫీజులు, తదితర అత్యవసర అవసరాల చెల్లింపుకు ప్రజలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామీణ బ్యాంకుల ఏర్పాటు చేయడానికి, స్వైపింగ్ యంత్రాలు సమకూర్చి ప్రజలందరికీ శిక్షణ ఇచ్చి పెద్ద నోట్ల రద్ధు ప్రభావాన్ని వివరించి వారిలో ఆత్మస్థరుుర్యం కల్పించడానికి  సమయం పడుతుంది. అందువల్ల ఇవన్నీ సమకూర్చే వరకూ సమయం ఇవ్వాలి.

 సర్కారుకు, సామాన్యులకు ఇక్కట్లు తప్పేవి
 నవంబర్ 9, 2016 నుంచి బంగారు వ్యాపారం, భూములు కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లపై నిఘా వేయాలని ఆదాయపు పన్ను శాఖను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఇదే పద్ధతిలో నవంబర్ 9, 2016 నుంచి రూ.2.50 లక్షల కన్నా ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసే వారిపై కూడా ఆదాయపు పన్ను శాఖ నిఘా వేసింది. అందువల్ల పెద్ద నోట్ల రద్దును ఏప్రిల్ 1, 2017 నుంచి అమలు చేసి ఉన్నా పెద్దగా వ్యత్యాసం ఉండేది కాదు. ఈ వ్యవధిలో అవసరమైన మేరకు కరెన్సీని ముద్రించి.. బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసులకు చేర్చే వెసుబాటు ప్రభుత్వానికి ఉండేది. డిపాజిట్లు, నోట్ల మార్పిడికి అవసరమైన ఏర్పాటు చేసుకునే అవకాశం బ్యాంకులకు కలిగేది. సాంప్రదాయ నగదు విధానం నుంచి ప్లాస్టిక్ మనీ దిశగా ప్రజలను.. ప్రధానంగా గ్రామీణులను సమర్థవంతంగా మళ్లించేలా కార్యక్రమాలు చేపట్టి అవగాహన కల్పించే అవకాశం ప్రభుత్వానికి ఉండేది.’’ అని జగన్‌మోహన్‌రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
 
 ప్రజాజీవితాల్లో డబ్బుది చాలా చెడ్డపాత్ర
 ప్రజా జీవితాల్లో డబ్బు ఎంతో చెడ్డ పాత్ర పోషిస్తోంది. అందుకు ఎన్నో ఉదాహరణ లు చూడొచ్చు. రాజకీయ నేతలు సాధార ణ ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెడుతున్నారు.  2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడానికి రూ. 11 కోట్లు ఖర్చు పెట్టానని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, ప్రస్తుత అసెంబ్లీ స్పీకరు కోడెల శివప్రసాదరావు ప్రముఖ తెలుగు టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో  చెప్పారు. ఈ విషయమై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు మేం ఫిర్యాదు కూడా చేశాం. అరుుతే ఇప్పటి వరకూ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చంద్రబా బు మితిమీరిన అవినీతి,  అక్రమ సంపా దనతో మా పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలను కొనుగోలు చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ నియమాలను తుంగలో తొక్కు తూ ఫిరారుుంపులను ప్రోత్సహించడంపై మేం  స్పీకరుకు ఫిర్యాదు చేశాం. స్పీకరు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకో లేదు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఆడియో వీడియో టేపుల్లో బాబు దొరికిపోయారు. ఆడియో టేపుల్లో గొంతు తన గొంతు కాదని, తాను స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడలేదని చెప్పలేని  బాబు ఒక సీఎంను ఫోన్‌లో ఎలా ట్రాప్ చేస్తారని ప్రశ్నించారు. బహుశా దేశంలో ఇలా రెడ్‌హ్యాండెడ్‌గా  పట్టుబడి రాజీనామా చేయకుండా, అరెస్టు కాకుండా ఉన్న ఏకై క సీఎం చంద్రబాబే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement