హైదరాబాద్: ఎంసెట్-3 పరీక్ష ఫలితాలను సెప్టెంబరు 15వ తేదీన విడుదల చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ముందుగానే ఈనెల 16వ తేదీన ఫలితాలు విడుదల చేయాలనుకున్నా.. ప్రవేశాలు ఆలస్యం కాకుండా ఒక రోజు ముందుగానే ప్రకటించాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా కమిటీ విడుదల చేసిన రాత పరీక్ష ప్రాథమిక కీపై ఈనెల 14వ తేదీన సాయంత్రం వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు.
అదే రోజు సాయంత్రం నిపుణుల కమిటీ సమావేశమై అభ్యంతరాలను పరిశీలించి ఫైనల్ కీని ఖరారు చేయనుంది. ఈ ప్రకారం 15వ తేదీనే తుది ర్యాంకులను ఖరారు చేసి అదే రోజు ప్రకటించాలని, లేదంటే 16న ఫలితాలను విడుదల చేయాలని కమిటీ భావిస్తోంది.
15నే ఎంసెట్-3 ఫలితాలు?
Published Tue, Sep 13 2016 6:13 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM
Advertisement
Advertisement