వైద్య ఆరోగ్య శాఖ స్పష్టత ఇవ్వని కారణంగానే...
సాక్షి, హైదరాబాద్: ‘ఆయుష్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) నోటిఫికేషన్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) జారీ చేస్తే.. విద్యార్థులంతా నీట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ ఉంటుంది’ అన్న షరతుతో ఎంసెట్ నోటిఫికేషన్‌ను జారీ చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలు నీట్ ద్వారా ఉంటాయా? లేక ఎంసెట్ ద్వారా చేపడతారా? అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలంటూ గత నెల 21వ తేదీన తెలంగాణ ఉన్నత విద్యామండలి లేఖ రాసినా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
పైగా తామెలా స్పష్టత ఇస్తామని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు మౌఖికంగా చెబుతున్న నేపథ్యంలో.. షరతులతో ఎంసెట్ నోటిఫికేషన్ జారీకి చర్యలు చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇక ఎంసెట్‌తోపాటు ఐసెట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ఆన్‌లైన్ సేవలను అందించే సర్వీసు ప్రొవైడర్ ఎంపికపై గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆయుష్‌పై షరతుతో ఎంసెట్ నోటిఫికేషన్!
Published Thu, Mar 9 2017 3:00 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement
Advertisement