
'ఎస్సై మృతిపై సీఐడీతో విచారణ'
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్ఐ రమేష్ మృతిపై సీఐడీతో విచారణ చేయిస్తామని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి అన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఆయన పేర్కొన్నారు. ఎస్ఐ రమేష్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన చెప్పారు.
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై క్రమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఎస్ఐ రమేష్ మృతిపై తెలంగాణ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిన విషయం విదితమే. ఆయన మృతి వెనక ఇసుక మాఫియా ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.