3,574 రైతు సమన్వయ సమితుల ఏర్పాటు | Establishment of 3,574 farmer coordination sets | Sakshi
Sakshi News home page

3,574 రైతు సమన్వయ సమితుల ఏర్పాటు

Published Wed, Sep 6 2017 3:44 AM | Last Updated on Mon, Oct 1 2018 4:15 PM

3,574 రైతు సమన్వయ సమితుల ఏర్పాటు - Sakshi

3,574 రైతు సమన్వయ సమితుల ఏర్పాటు

రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ వెల్లడి  
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం నాటికి 3,574 గ్రామ రైతు సమన్వయ సమితులు ఏర్పాటైనట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ డాక్టర్‌ జగన్‌మోహన్‌ వెల్లడించారు. మొత్తం 10,733 రెవెన్యూ గ్రామాలుండగా.. ఐదు రోజులు గడిచినా ఇంకా తక్కువే ఏర్పాటు కావడంపై అధికారులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. అత్యధికంగా నిర్మల్‌ జిల్లాలో 331, ఆదిలాబాద్‌లో 326, నిజా మాబాద్‌లో 323, ఖమ్మం జిల్లాలో 297, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 231, కామారెడ్డి జిల్లాలో 205 గ్రామ రైతు సమన్వయ సమితులు ఏర్పాటయ్యాయి.

జగిత్యాల, యాదాద్రి జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ బోణీ కాలేదు. నల్లగొండ జిల్లాలో 11 మాత్రమే ఏర్పాటయ్యాయి. మండలంలో అన్ని గ్రామాల్లో సమితులు ఏర్పాటైతేనే మండల సమితిని ఏర్పాటు చేస్తారు. అలాగే జిల్లాలోని గ్రామ, మండల సమితులు పూర్తయ్యా కే జిల్లా సమితులు ఏర్పాటవుతాయి. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క మండలంలోనూ అన్ని గ్రామాలకు సమితులు ఏర్పాటు కాలేదు. కాగా, సమితులు ఏర్పాటు చేయడానికి ఇంకా 4 రోజులు మాత్రమే గడువు ఉండటంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement