‘ఫీజు’ బకాయిలపై కదం తొక్కిన కాంగ్రెస్
రాష్ట్ర యువజన కాంగ్రెస్ మహాధర్నా.. పలువురి అరెస్టు
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి లు, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ని పోలీసు లు భగ్నం చేశారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.అనిల్‌కుమార్‌యాదవ్ సహా పలువురు కార్యకర్తలను అరెస్టు చేసి గాంధీ నగర్ పీఎస్‌కు పోలీసులు తరలించారు. ఫీజు బకాయిలు చెల్లించాలని, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఇందిరాపార్కు వద్ద రాష్ట్ర యువజన కాంగ్రెస్ మహాధర్నా నిర్వహించిం ది. అనంతరం అసెంబ్లీ వైపు ప్రదర్శనగా దూ సుకు వెళ్తున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను పోలీసులు ఇందిరాపార్కు చౌరస్తాలో అడ్డుకుని అరెస్టు చేశారు.
రుణమాఫీపై కేసీఆర్ మోసం: జైపాల్
యూత్ కాంగ్రెస్ మహాధర్నాలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ అందమైన, ఆచరణ సాధ్యంకాని హామీలతోనే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని అన్నారు. రైతుల రుణమాఫీని ఒకే విడతగా చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. టీఆర్‌ఎస్, కేసీఆర్‌తో తెలంగా ణ రాలేదని, విద్యార్థులు, యువకుల బలిదా నాలకు సోనియాగాంధీ చలించి తెలంగాణ ఇచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమకాలంలో కేసీఆర్ చేసింది దొంగ దీక్ష అని, రోజుకు 750 కేలరీల ఆహారాన్ని దీక్ష సమయంలో తీసుకు న్నారని, దీనికి సంబంధించి తన వద్ద ఆధా రాలు ఉన్నాయని అన్నారు. నోట్ల రద్దు తర్వాత ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌కు మధ్య జరిగిన ఒప్పందం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే సత్తా యూత్ కాంగ్రెస్‌కు ఉందని అన్నారు. ఫీజు బకాయిలు చెల్లించకపో వడంతో 3,250 కళాశాలలకు చెందిన దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.
యువకులు, విద్యార్థుల బలిదానాల పునాదులపై కేసీఆర్ సర్కారు ఏర్పడిందని, కానీ, యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా, విద్యార్థులకు ఫీజులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసి డెంట్ మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించే వరకు ప్రభుత్వంపై యూత్ కాంగ్రెస్ పోరాటం ఆగ దని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రాజగోపాల్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, గండ్ర వెంకటర మణారెడ్డి, సుధీర్‌రెడ్డి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.