హైదరాబాద్: బండ్లగూడ ఆనంద్‌నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. నలుగురు అదృశ్యం ఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వారం కిందట ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఖమ్మం జిల్లా కాకర్వాయికి బయలుదేరారు.
ఏడు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ వారు ఇంటకి చేరుకోలేదని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.