జీహెచ్ఎంసీ వార్డు రిజర్వేషన్లు ఇవీ..
జీహెచ్ఎంసీ వార్డు రిజర్వేషన్లు ఇవీ..
Published Mon, Dec 14 2015 1:11 PM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM
హైదరాబాద్: హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలోని షెడ్యూల్ తెగలు, కులాలు, మహిళలకు సంబంధించి రిజర్వేషన్లను కేటాయించింది. ఎస్టీ విభాగంలో మహిళ, జనరల్ కేటగిరిలో ఒక్కో వార్డును కేటాయించింది. ఎస్సీ విభాగంలో 8 వార్డులు జనరల్, నాలుగు వార్డులు మహిళలకు కేటాయించారు. కాగా బీసీలకు 33 వార్డులు జనరల్, 17 వార్డులు బీసీ మహిళలకు కేటాయించారు. కాగా.. 28 వార్డులను జనరల్ మహిళలకు కేటాయించారు. మిగిలిన 58 వార్డులకు జనరల్ అభ్యర్థులకు కేటాయించారు.
ఆయా వార్డుల కేటగిరీలు ఇలా ఉన్నాయి:
ఎస్టీ (జనరల్)
అమీర్ పేట్ (99)
ఎస్టీ (మహిళ)
జంగమ్ మెట్ (26)
ఎస్సీ (జనరల్)
రాజేంద్రనగర్ (59), జియాగూడ (52) కవాడీగూడ (94), గచ్చిబౌలి (111), మచ్చ బొల్లారం (133), ఓల్డ్ మల్కాజ్ గిరి (139)
మెట్టుగూడ (141), బన్సీలాల్ పేట్ (146)
ఎస్సీ( మహిళ)
అల్వాల్ (132), యాప్రాల్ (134), పద్మారావు నగర్ (145), అడ్డగుట్ట (150)
బీసీ (జనరల్)
మూసారంబాగ్ (18), చావ్ నీ (31), డబీర్ పురా (36), గౌలి పురా(41), ఆలియాబాద్(41), ఫతేదర్వాజా (46), బేగంబజార్ (50) గోషామహల్ ( 51), ధూల్ పేట (52), దూద్ బౌలి (54), రామ్నస్ పురా( 55), మైలార్ దేవ్ పల్లి( 58), మంగళ్ హాట్ (64), మురాద్ నగర్ (66), లంగర్ హౌస్ (69), టోలీ చౌకి (70), అహ్మద్ నగర్ (72), మల్లేపల్లి(75), సుల్తాన్ బజార్ (79), అంబర్ పేట (84), బాగ్ అంబర్ పేట్ (85), ఎర్రగడ్డ (102), రహ్మత్ నగర్ (107), శేరిలింగంపల్లి (112), హఫీజ్ పేట్ (113), చందానగర్ (114), పటాన్ చెరువు (116), గాజుల రామారం (125), జగద్గిరి గుట్ట (126), చింతల్ (127), షాపూర్ నగర్ (128), జీడిమెట్ల (130), సీతాఫల్ మండీ (142)
బీసీ(మహిళ)
ఫలక్ నుమా (43), నవాబ్ సాహిబ్ కుంట(44), జహానుమా(45), పురానా పూల్( 53), కార్వాన్(61), దత్తాత్రేయ నగర్ (63), ఆసిఫ్ నగర్(65), గుడిమల్కాపూర్(68), నానల్ నగర్(71), రెడ్ హిల్స్ (76), కాచిగూడ(82), రామ్ నగర్ (90), రామచంద్రాపురం(115), బౌద్ధనగర్ (143), చిలకల గూడ(144), రాంగోపాల్ పేట్ (147), మారేడ్ పల్లి (149),
జనరల్ (మహిళ)
ఉప్పల్ (5), మన్సూరాబాద్ (9), కర్మన్ ఘాట్(12), సరూర్ నగర్ (14), రామకృష్ణాపురం(15), గడ్డి అన్నారం(16), పీఅండ్ టీ కాలనీ(17), ఘన్సీ బజార్ (49), అత్తాపూర్ (60), విజయ్ నగర్ కాలనీ (73), చింతల్ బస్తీ(74), హిమాయత్ నగర్ (80), నల్లకుంట(87), అడిక్ మెట్(81), ముషీరా బాద్ (91), గాంధీనగర్ (93), దోమల్ గూడ(95), బల్కంపేట్(100), శ్రీనగర్ కాలనీ(104), బంజారాహిల్స్ (105), బోర బండ(108), జూబ్లీ హిల్స్ (109), డిఫెన్స్ కాలనీ(135), మౌలాలీ(136), సఫిల్ గూడ(137), గౌతమ్ నగర్ (138), తార్నాక (140), బేగంపేట్ (148)
Advertisement