మహారాష్ట్ర నుంచి నేడు తిరిగి రానున్న రాష్ట్ర బృందం
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రానికి వస్తున్న సీఎం కేసీఆర్, రాష్ట్ర బృందానికి ఘన స్వాగతం పలకనున్నారు.బుధవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి సీఎం చేరుకొంటారు. విమానాశ్రయం వద్ద భారీగా స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశా రు.దీనికి దాదాపు లక్ష మంది జనాన్ని సమీకరించనున్నారు. వేదికపై సీఎం ప్రసంగించిన అనంతరం భారీ ర్యాలీగా క్యాంపు కార్యాలయానికి చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ స్వాగత కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఈ నెల 20నే 14 ప్రభుత్వ శాఖలకు మెమో జారీ చేసింది. హైదరాబాద్ కలెక్టర్, పోలీస్ కమిషనర్లతో కార్యక్రమాన్ని సమన్వయం చేసే బాధ్యతలను టీఎస్‌ఎండీసీ చైర్మన్ సుభాష్‌రెడ్డికి అప్పగించారు. వేదిక తదితర ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పర్యవేక్షిస్తున్నారు.
అపూర్వంగా స్వాగతం
తెలంగాణ, మహారాష్ట్ర మధ్య సాగునీటి ప్రాజెక్టుల ఒప్పందానికి కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు అపూర్వంగా స్వాగతం పలుకుతామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం మహారాష్ట్రతో ఒప్పందం కుదిరిన అనంతరం ఆయన ముంబై నుంచి ఫోన్ ద్వారా మాట్లాడారు. కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు బుధవారం బేగంపేట విమానాశ్రయంలో అభినందన సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కేసీఆర్‌కు ‘మహా’ స్వాగతం!
Published Wed, Aug 24 2016 2:50 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM
Advertisement
Advertisement