ఫిల్మ్‌నగర్ క్లబ్ కార్యకలాపాల నిర్వహణకు హైకోర్టు అనుమతిచ్చింది.
జీహెచ్‌ఎంసీ అధికారులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఫిల్మ్‌నగర్ క్లబ్ కార్యకలాపాల నిర్వహణకు హైకోర్టు అనుమతిచ్చింది. క్లబ్‌కు వేసిన సీల్‌ను తొలగించి, కార్యకలాపాల నిర్వహణకు గతంలో వలే అనుమతినివ్వాలని జీహెచ్‌ఎంసీ అధికారులను హైకో ర్టు ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌కు చెంది న పోర్టికో కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కల్చరల్ సెంటర్‌తో పాటు ఫిల్మ్‌నగర్ క్లబ్‌కు కూడా జీహెచ్‌ఎంసీ అధికారులు తాళాలు వేశారు. దీన్ని సవాలు చేస్తూ కల్చరల్ సెంటర్ బాధ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై జస్టిస్ చల్లా కోదండరామ్ శుక్రవారం విచారణ జరిపారు. ఫిల్మ్ నగర్ క్లబ్ తరఫు సీనియర్ న్యాయవాది డి.వి.సీతారామ్మూర్తి వాదన లు వినిపిస్తూ, జీహెచ్‌ఎంసీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే క్లబ్‌కు తాళం వేసిందన్నారు. జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఎలాంటి అనుమతులు లేకుండానే క్లబ్ యాజమాన్యం పోర్టికో నిర్మాణ పనులను చేపట్టిందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, క్లబ్‌కు వేసిన సీల్‌ను తొలగించి, కార్యకలాపాల నిర్వహణకు అనుమతివ్వాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.