
ఆగస్టులో సెలవులే సెలవులు..
హైదరాబాద్ : ఆగస్టు నెలలో ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. ఆగస్టు 12న రెండో శనివారం, 13 ఆదివారం, 14 కృష్ణాష్టమి, 15న స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు వరుసగా నాలుగు రోజులు పని చేయవు. అయితే ఆగస్టు 14న కృష్ణాష్టమికి బ్యాంకులకు సెలవు లేదు.
అదే విధంగా ఆగస్టు 25న వినాయకచవితి, 26న నాలుగో శనివారం, 27న ఆదివారం కావడంతో బ్యాంకులు వరుసగా మూడురోజులు పనిచేయవు. శ్రావణమాసం శుభ కార్యాలకు తోడు వరుస సెలవులు తోడవ్వడంతో బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సందడిలో సడేమియాలా ప్రయివేట్ ట్రావెల్స్ అమాంతం టికెట్ ధరలు పెంచేశాయి.