తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ వేడుకలు ప్రతీక అని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.
సైదాబాద్: తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ వేడుకలు ప్రతీక అని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఐఎస్‌సదన్ డివిజన్ పరిధిలోని ఇంద్రప్రస్థ కాలనీ, కేశవనగర్ కాలనీలో బుధవారం జరిగిన బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర హోంమంత్రి పాల్గొని బతుకమ్మ ఆడారు. స్థానిక కార్పొరేటర్ సామ స్వప్న సుందర్‌రెడ్డి, మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతు అందరిని ఉత్సాహపరిచారు. అనంతరం దాండియా ఆడారు.